జ‌ట్టును ప్ర‌క‌టించిన వెస్టిండీస్.. సీనియర్ బౌల‌ర్ రీ ఎంట్రీ | West Indies announce squad for ODI series against India | Sakshi
Sakshi News home page

IND vs WI: జ‌ట్టును ప్ర‌క‌టించిన వెస్టిండీస్.. సీనియర్ బౌల‌ర్ రీ ఎంట్రీ

Jan 27 2022 10:13 AM | Updated on Jan 27 2022 11:17 AM

West Indies announce squad for ODI series against India - Sakshi

భారత్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును గురువారం ప్ర‌క‌టించింది. సీనియ‌ర్ బౌల‌ర్ కెమర్ రోచ్‌తో పాటు న్క్రుమా బోన్నర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అదే విధంగా బ్రాండన్ కింగ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ జ‌ట్టుకు కీరన్ పొలార్డ్ సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. కాగా వెస్టిండీస్ జ‌ట్టు భార‌త‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఫిబ్రవరి 6న భార‌త్‌- వెస్టిండీస్ మ‌ధ్య తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుంది. మూడు వ‌న్డేలు కూడా  అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో  జరుగనున్నాయి.

వెస్టిండీస్ జ‌ట్టు: కీరన్ పొలార్డ్ (సి), ఫాబియన్ అలెన్, న్క్రుమా బోన్నర్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, కెమర్ రోచ్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, హేడెన్ వాల్ష్ జూనియర్.

చ‌దవండి: IND Vs WI: అయ్యర్‌పై వేటు.. రవి బిష్ణోయ్‌కు బంపరాఫర్‌; తొలి వన్డేకు రాహుల్‌ దూరం

Advertisement
 
Advertisement
Advertisement