Sakshi News home page

IPL 2024: డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత.. క్రిస్‌ గేల్‌ వరల్డ్‌ రికార్డు సమం

Published Sun, Mar 31 2024 10:38 PM

Warner equals Gayles record of most fifty-plus scores in T20s - Sakshi

టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన క్రిస్‌ గేల్‌ రికార్డును వార్నర్‌ సమం చేశాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 52 పరుగులు చేసిన వార్నర్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.

వార్నర్‌ ఇప్పటివరకు 110 సార్లు ఫిప్టీ ప్లస్‌ స్కోర్లు సాధించగా.. క్రిస్‌ గేల్‌ కూడా 110 సార్లు ఏభైకి పైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో గేల్‌ రికార్డును వార్నర్‌ బ్రేక్‌ చేసే ఛాన్స్‌ ఉంది. వీరి తర్వాతి స్ధానాల్లో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ఉన్నాడు. కోహ్లి టీ20ల్లో ఇప్పటివరకు 101 సార్లు  ఫిప్టీ ప్లస్‌ పరుగులు సాధించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్‌ వార్నర్‌(52), రిషబ్‌ పంత్‌(51) హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు. అదేవిధంగా ఈ ఏడాది సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న పృథ్వీ షా(43) పరుగులతో రాణించాడు. వార్నర్‌,పృథ్వీ షా తొలి వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సీఎస్‌కే బౌలర్లలో పతిరాన 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా, ముస్తఫిజర్‌ రెహ్మన్‌ తలా వికెట్‌ సాధించారు

Advertisement

తప్పక చదవండి

Advertisement