భారత జట్ల శుభారంభం | Uber Cup: Indian Men Team Beat Thailand Women Team Defeat Canada | Sakshi
Sakshi News home page

భారత జట్ల శుభారంభం

Apr 28 2024 9:08 AM | Updated on Apr 28 2024 9:08 AM

లక్ష్య సేన్‌

చెంగ్డు (చైనా): ప్రతిష్టాత్మక టీమ్‌ ఈవెంట్లు థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. థామస్‌ కప్‌లో భాగంగా గ్రూప్‌ ‘సి’లో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల టీమ్‌ 4–1 తేడాతో థాయిలాండ్‌పై విజయం సాధించింది. మహిళల టోర్నీ ఉబెర్‌ కప్‌ గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌ 4–1 స్కోరుతోనే కెనడాను ఓడించింది. 

తొలి సింగిల్స్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌పై  కున్లావట్‌ వితిద్‌సన్‌ గెలుపొందాడు. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలు భారత్‌ ఖాతాలో చేరాయి.  తీరారట్‌సకుల్‌ పై లక్ష్యసేన్, సరన్‌జమ్‌శ్రీపై కిడాంబి శ్రీకాంత్‌ విజయం సాధించారు. 

తొలి డబుల్స్‌లో సుక్‌ఫున్‌ – తీరారట్‌సకుల్‌ జంటపై సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌శెట్టి జోడి... పన్‌పనిచ్‌ – సొథోన్‌పై ఎంఆర్‌  అర్జున్‌ – ధ్రువ్‌ కపిల గెలిచారు.   

ఉబెర్‌ కప్‌లో తొలి సింగిల్స్‌లో మిచెల్‌ లిపై అస్మిత చాలిహ,  కేథరీన్‌ – జెస్లీన్‌పై ప్రియ – శృతి, వెన్‌ జాంగ్‌పై ఇషారాణి బారువా గెలుపొందారు. అయితే రెండో డబుల్స్‌లో  జాకీ డెంట్‌ – క్రిస్టల్‌ లాయ్‌ చేతిలో సిమ్రన్‌ సింఘీ – రితిక ఠాకర్‌ ఓడిపోగా... చివరి మ్యాచ్‌లో ఎలియానా జాంగ్‌పై అన్మోల్‌ ఖర్బ్‌  విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement