
హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో జరుగుతున్న రాష్ట్రస్దాయి బాక్సింగ్ పోటీల్లో గందరగోళం నెలకొంది. పోటీల సమయంలో బాక్సర్లు, కోచ్‌లు ఘర్షణకు దిగారు. గురువారం ఇద్దరు బాక్సర్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వివాదం తలెత్తింది.
తప్పుడు అంపైరింగ్ కారణంగా ఓడిపోయామని ఓ టీమ్‌కు చెందిన సభ్యులు మరో వర్గంపై దాడి చేశారు. ఈ గొడవలో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. అనంతరం గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్