120 కోట్ల మంది చూశారు  | TATA IPL 2026 reaches 1. 2 billion viewers as Connected TV viewership | Sakshi
Sakshi News home page

120 కోట్ల మంది చూశారు 

Jun 16 2026 6:02 AM | Updated on Jun 16 2026 6:02 AM

TATA IPL 2026 reaches 1. 2 billion viewers as Connected TV viewership

ఐపీఎల్‌–2026పై అభిమానుల అమితాసక్తి 

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చరిత్రలో ఎక్కువ మంది ప్రేక్షకుల అభిమానం పొందిన సీజన్‌గా 2026 నిలిచింది. ఈసారి టీవీ, డిజిటల్‌ వేదికలపై కలిపి ఏకంగా 120 కోట్ల మంది ఐపీఎల్‌ను వీక్షించినట్లు టోర్నీ అధికారిక ప్రసారకర్త ‘జియో హాట్‌స్టార్‌’ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 7 శాతం ఎక్కువ కావడం విశేషం. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే ఎక్కువ వ్యూయర్‌షిప్‌ వచ్చిన మ్యాచ్‌గా గుర్తింపు పొందింది. 

ఆర్‌సీబీ వరుసగా టైటిల్‌ గెలిచిన ఈ పోరును వేర్వేరు స్క్రీన్‌లపై కలిపి 40 కోట్ల మంది చూడటం కొత్త రికార్డుగా నమోదైంది. ప్రేక్షకుల సంఖ్య గత ఏడాదికంటే ఈ సారి టీవీల్లో 22 శాతం, డిజిటల్‌లో 8 శాతం పెరగగా...జియో హాట్‌ స్టార్‌ ప్రాంతీయ డిజిటల్‌ చానల్స్‌లో ఐపీఎల్‌ వ్యూయర్‌షిప్‌ ఏకంగా 33 శాతం పెరిగింది. తాజా రేటింగ్‌ అంతర్జాతీయ క్రీడల్లో ఐపీఎల్‌ స్థాయి ఏమిటో చూపించాయని, మున్ముందు మరిన్ని కొత్త హంగులు, టెక్నాలజీతో ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ప్రయతి్నస్తామని జియో స్టార్‌ సీఈఓ ఇషాన్‌ ఛటర్జీ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement