
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల్లో రెండు హాఫ్ సెంచరీలతో సూర్య చెలరేగాడు. వన్డేల్లో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సూర్యకుమార్.. ఆసీస్ సిరీస్‌తో తిరిగి గాడిలో పడ్డాడని చెప్పుకోవాలి.
ముఖ్యంగా వరల్డ్‌కప్‌కు ముందు సూర్య ఈ తరహా ప్రదర్శన చేయడం భారత జట్టుకు సానుకూలాంశం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో సూర్య అద్భుతంగా రాణించినప్పటికీ.. తుది జట్టులో చోటు దక్కడం చాలా కష్టమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
"వన్డే క్రికెట్‌లో సూర్యకుమార్ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అతడు చివరి 15 నుంచి 20 ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్ చేయగలడు. ఆ సమయంలో టీ20 ఫార్మాట్ మాదిరిగా ఆడుతాడు. టీ20ల్లో అద్భుతమైన ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ హార్దిక్, రాహుల్, ఇషాన్ కూడా ఆఖరి ఓవర్లలో అద్భుతంగా రాణించగలరు.
కాబట్టి సూర్యకుమార్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం చాలా కష్టం. ఇప్పటికే నాలుగో స్ధానంలో శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. ఒకవేళ నెంబర్ 4లో సూర్యకు అవకాశం లభిస్తే భారీ శతకం సాధించి తనకు తను నిరూపించుకోవాలి. అప్పుడే అతడిపై జట్టు మేనెజ్‌మెంట్ నమ్మకం ఉంచుతుందని" ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: ODI WC 2023: కోహ్లిని ఔట్ చేయడానికి ఐదు బంతులు చాలు.. పసికూన బౌలర్ వార్నింగ్