Ind Vs Wi: Suryakumar Hits 100 T20i Sixes, Second Quickest To Reach The Milestone After Evin Lewis - Sakshi
Sakshi News home page

IND vs WI: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌.. ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా!

Aug 9 2023 9:15 AM | Updated on Aug 9 2023 10:20 AM

Suryakumar hits 100 T20I sixes, second quickest after Lewis - Sakshi

టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఎట్టకేలకు తన ప్రతాపాన్ని చూపించాడు. గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను మిస్టర్‌ 360 ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. సూర్య సంచలన ఇన్నింగ్స్‌ ఫలితంగా కీలకమైన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. 

సూర్య అరుదైన ఫీట్‌..
ఇక ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో సూర్య 100 సిక్స్‌ల మైలు రాయిని అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 10 ఓ‍వర్‌ వేసిన షెఫెర్డ్‌ బౌలింగ్‌లో తన వందో సిక్స్‌ను సూర్య బాదాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్స్‌లు కొట్టిన రెండో ఆటగాడిగా సూర్య రికార్డులకెక్కాడు. స్కై తన 49వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత అందుకున్నాడు. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో విండీస్‌ ఆటగాడు ఎవిన్‌ లూయిస్‌ తొలి స్ధానంలో ఉన్నాడు.

లూయిస్‌ 42 ఇన్నింగ్స్‌లలోనే తన 100 సిక్స్‌లను పూర్తి చేశాడు. అదే విధంగా టీ20ల్లో 100 సిక్స్‌ల మైలు రాయిని అందుకున్న మూడో భారత బ్యాటర్‌గా సూర్యకుమార్‌ నిలిచాడు. ఈ జాబితాలో సూర్యకంటే ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఉన్నారు.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. మా సత్తా చూపించాం! అతడు మరోసారి: హార్దిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement