Sri Lanka Vs India 2nd Test Match, Day 2 Updates: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టులో రెండో రోజు ఆట మొదలైంది.
నిలకడగా ఆడుతున్న జురెల్, పంత్
రెండో రోజు ఆట ప్రారంభమయ్యాక రెండో ఓవర్‌లోనే సరాన్ష్ వికెట్ కోల్పోయాక భారత బ్యాటర్లు రిషబ్ పంత్ (19), ధ్రువ్ జురెల్ (26) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 342-6గా ఉంది.
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్‌కు షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ సరాన్ష్ జైన్ (6) అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో కమిల్ మిషారాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 307-6గా ఉంది. ధ్రువ్ జురెల్‌కు (11) జతగా తొలి రోజు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రిషబ్ పంత్ (3) క్రీజ్‌లోకి వచ్చాడు.
రెండో రోజు మొదలైన ఆట
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆట మొదలైంది. సరాన్ష్ జైన్ 4), ధ్రువ్ జురెల్ (7) క్రీజ్‌లోకి వచ్చారు. ఓవర్‌నైట్ స్కోర్ 300-5 వద్ద భారత్ ఆట మొదలుపెట్టింది.
తుది జట్లు..
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సరాన్ష్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
శ్రీలంక (ప్లేయింగ్ XI): లాహిరు ఉదార, కమిల్ మిషార, పసిందు సూర్యబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేషారా నువంత, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో


