భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రణేశ్ ఎం హంగేరీలో జరిగిన ప్రతిష్ఠాత్మక కెనిజ్సా ఓపెన్ 2026లో గ్రూప్-ఎ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల ప్రణేశ్ ఆదివారం జరిగిన తొమ్మిదో, చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన వాదిమ్ పెట్రోవ్‌స్కీపై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు.
తెల్ల పావులతో ఆడిన ప్రణేశ్ కీలకమైన చివరి రౌండ్‌లో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. తొమ్మిది రౌండ్లలో మొత్తం 7 పాయింట్లు సాధించిన ప్రణేశ్ మరో ముగ్గురు ఆటగాళ్లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే టైబ్రేక్ ఆధారంగా కెనిజ్సా ఓపెన్ గ్రూప్-ఎ విజేతగా అవతరించాడు.
ప్రస్తుతం 2673 రేటింగ్‌తో ఉన్న ప్రణేశ్.. ఆగస్టు 2026 తాజా FIDE ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ విజయంతో అంతర్జాతీయ చెస్ వేదికపై భారత యువ ప్రతిభ మరోసారి సత్తా చాటింది.
Meet the new Indian Chess Champion!! Pranesh M.
Huge Congratulations! 🇮🇳♟️ to Indian Grandmaster Pranesh M on his brilliant victory at the prestigious Kanizsa Open 2026 in Nagykanizsa, Hungary!
After a thrilling 9th round, Pranesh secured the top spot in one of Central… pic.twitter.com/qHDY74ucDR— India in Hungary (@IndiaInHungary) August 23, 2026
భారత రాయబార కార్యాలయం అభినందనలు
హంగేరీలోని భారత రాయబార కార్యాలయం ప్రణేశ్ విజయంపై అభినందనలు తెలిపింది. కెనిజ్సా ఓపెన్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ సాధించినందుకు ప్రణేశ్‌ను ప్రశంసించింది.
తమిళనాడులోని కారైకుడికి చెందిన ప్రణేశ్ ఎం చిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగి అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్నాడు. కెనిజ్సా ఓపెన్‌లో ఏడు పాయింట్లతో సంయుక్త అగ్రస్థానం సాధించడం అతడి తాజా విజయాల్లో మరో మైలురాయిగా నిలిచింది.
19 ఏళ్ల వయసులోనే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-50లో చోటు సంపాదించిన ప్రణేశ్.. రానున్న టోర్నీల్లో మరింత మెరుగైన ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో పైకి దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.


