ప్రిక్వార్టర్స్‌లో శ్రీజ, స్నేహిత్‌  | Sreeja and Snehit in prequarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో శ్రీజ, స్నేహిత్‌ 

Mar 20 2024 2:12 AM | Updated on Mar 20 2024 2:12 AM

Sreeja and Snehit in prequarters - Sakshi

బీరుట్‌ (లెబనాన్‌): ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) ఫీడర్‌ లెవెల్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్లు ఆకుల శ్రీజ, సూరావజ్జుల స్నేహిత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో శ్రీజ 11–4, 11–3, 11–8తో అష్తారి మషిద్‌ (ఇరాన్‌)పై గెలిచింది.

డబుల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీజ–దియా చిటాలె (భారత్‌) జోడీ 12–10, 11–7, 14–12తో నథాలీ మర్చెటి–లిలూ మసార్ట్‌ (బెల్జియం) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో స్నేహిత్‌ 10–12, 11–5, 12–10, 11–3తో ఖాలిద్‌ ఖాదర్‌ (జోర్డాన్‌)పై, తొలి రౌండ్‌లో 11–6, 11–8, 11–6తో బాసిల్‌ హర్బ్‌ (లెబనాన్‌)పై గెలుపొందాడు. 

Advertisement
 
Advertisement
Advertisement