డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా! తొలిసారి భార‌త్ మిస్‌ | South Africa Vs Australia WTC 2025 Final, India Misses Out On ICC Test Mace Contention For 1st Time | Sakshi
Sakshi News home page

WTC 2025: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా! తొలిసారి భార‌త్ మిస్‌

Jan 5 2025 10:59 AM | Updated on Jan 5 2025 1:42 PM

South Africa vs Australia WTC Final set, India misses out 1st time

టీమిండియా వర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్-2025 ఫైన‌ల్(WTC Final) ఆశ‌లు ఆడియాశ‌లు అయ్యాయి. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భార‌త్ ఓట‌మి చవిచూసింది. దీంతో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ రేసు నుంచి భార‌త్ నిష్క్ర‌మించింది.

టీమిండియా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ఆర్హ‌త సాధించ‌క‌పోవ‌డం ఇదే తొలిసారి. 2019-21 సైకిల్‌లో టీమిండియా 70 విన్నింగ్‌ శాతంతో తొట్ట తొలి సీజ‌న్‌లో భార‌త్ ఫైన‌ల్‌కు ఆర్హ‌త సాధించింది. కానీ విరాట్ కోహ్లి సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఫైన‌ల్లో కివీస్ చేతిలో ఓట‌మి చవిచూసింది.

ఆ త‌ర్వాత సైకిల్‌(2021-23)లో కూడా అద్బుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన టీమిండియా ఫైన‌ల్‌కు క్వాలిఫై అయింది. కానీ డ‌బ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో మాత్రం త‌మ ఆధిపత్యాన్ని భార‌త్ కొన‌సాగించ‌లేక‌పోయింది. ఈ సీజ‌న్‌లో 19 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 9 విజ‌యాలు, 8 ఓట‌ముల‌ను చ‌విచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో 50 విన్నింగ్‌ శాతంతో మూడో స్ధానానికే రోహిత్‌ సేన పరిమితమైంది.

ఫైనల్లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా
ఇక ఈ విజయంతో ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హతసాధించింది. డ‌బ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో 17 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్‌.. 11 విజయాలు, 4 ఓటములును నమోదు చేసింది. పాయింట్లపట్టికలో ఆస్ట్రేలియా 63.73 విన్నింగ్‌ శాతంతో రెండో స్ధానంలో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.

మరోవైపు దక్షిణాఫ్రికా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది. టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైనల్‌కు ప్రోటీస్‌ ఆర్హత సాధించడం ఇదే తొలిసారి. ఇక జూన్‌ 11 నుంచి లార్డ్స్‌ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా అమీతుమీ తెల్చుకోనున్నాయి.
చదవండి: IND vs AUS: సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భార‌త్‌ ఔట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement