శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌.. మైఖేల్‌ వాన్‌, ఫ్లింటాఫ్‌ కుమారుల అరంగేట్రం | Sons Of Vaughan And Flintoff Likely To Make England U19 Test Debut Together | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌.. మైఖేల్‌ వాన్‌, ఫ్లింటాఫ్‌ కుమారుల అరంగేట్రం

Jul 3 2024 12:44 PM | Updated on Jul 3 2024 12:50 PM

Sons Of Vaughan And Flintoff Likely To Make England U19 Test Debut Together

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్లు మైఖేల్‌ వాన్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కుటుంబాల్లో రెండో తరం వచ్చింది. వీరిద్దరి కుమారులు ఆర్కీ వాన్‌, రాకీ ఫ్లింటాఫ్‌ ఒకేసారి ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యారు. శ్రీలంకతో జరిగే టెస్ట్‌ సిరీస్‌తో వీరిద్దరు ఇంగ్లండ్‌ తరఫున అరంగేట్రం చేయనున్నారు.

ఆర్కీ, రాకీతో పాటు ప్రస్తుత ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు సభ్యులు జో డెన్లీ, రెహాన్‌ అహ్మద్‌ సంబంధీకులు కూడా ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యారు. జో డెన్లీ అల్లుడు జైడన్‌ డెన్లీ.. రెహాన్‌ అహ్మద్‌ తమ్ముడు ఫర్హాన్‌ అహ్మద్‌ కూడా శ్రీలంక సిరీస్‌లో ఆడనున్నారు.

ఆర్కీ వాన్‌, రాకీ ఫ్లింటాఫ్‌ విషయానికొస్తే.. ఈ ఇద్దరు అప్‌కమింగ్‌ క్రికెటర్లు తమ తండ్రుల లాగే బ్యాటింగ్‌, బౌలింగ్‌ స్టయిల్‌లను ఎంచుకున్నారు. ఆర్కీ  తన తండ్రి లాగే రైట్‌ హ్యాండ్‌ టాపార్డర్‌ బ్యాటర్‌ కమ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌ కాగా.. రాకీ ఫ్లింటాఫ్‌ తన తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్‌లా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.

ఆర్కీ వాన్‌, రాకీ ఫ్లింటాఫ్‌ ఒకేసారి అరంగేట్రం చేస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్కీ, రాకీ ఒకేసారి తమ కెరీర్‌లు ప్రారంభించనుంటే.. మైఖేల్‌ వాన్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కలిసి ఇంగ్లండ్‌ తరఫున 48 టెస్ట్‌లు (1999-2008) ఆడారు.  

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌, శ్రీలంక అండర్‌-19 జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జులై 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జులై 8, 16 తేదీల్లో రెండు మ్యాచ్‌లు ప్రారంభం​ కానున్నాయి.

ఇంగ్లండ్ U19 స్క్వాడ్: హంజా షేక్ (కెప్టెన్‌), ఫర్హాన్ అహ్మద్, చార్లీ బ్రాండ్, జాక్ కార్నీ, జైద్న్ డెన్లీ, రాకీ ఫ్లింటాఫ్, కేశ్ ఫోన్సెకా, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, ఎడ్డీ జాక్, ఫ్రెడ్డీ మెక్‌కాన్, హ్యారీ మూర్, నోహ్ థైన్,  ఆర్కీ వాన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement