breaking news
England Under-19 team
-
ఆయుశ్ మాత్రే సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత అండర్–19 జట్టు దుమ్మురేపుతోంది. వన్డే సిరీస్ గెలుచుకున్న యువ భారత జట్టు... యూత్ టెస్టులో శుభారంభం చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం బెకెన్హామ్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత అండర్–19 జట్టు 88 ఓవర్లలో 7 వికెట్లకు 450 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (115 బంతుల్లో 102; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కగా... అభిజ్ఞ కుందు (95 బంతుల్లో 90; 10 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ కుమార్ (81 బంతుల్లో 85; 14 ఫోర్లు, 1 సిక్స్), విహాన్ మల్హోత్రా (99 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.వన్డే సిరీస్‌లో రికార్డు సెంచరీతో చెలరేగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (14) ఎక్కువసేపు నిలవలేకపోగా... అందులో పెద్దగా పరుగులు చేయలేకపోయిన ఆయుశ్ మాత్రే ‘శత’క్కొట్టాడు. అతడు రెండో వికెట్‌కు విహాన్‌తో కలిసి 173 పరుగులు జోడించాడు. టి20 తరహాలో ధనాధన్ ఆటతీరుతో రెచ్చిపోయిన అభిజ్ఞ, రాహుల్ నాలుగో వికెట్‌కు 27.4 ఓవర్లలోనే 179 పరుగులు జోడించడంతో యువభారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, ఆర్చీ వాన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. బ్యాటర్లంతా దూకుడు కనబర్చడంతో తొలి రోజు యంగ్‌ఇండియా 5కు పైగా రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. అంబ్రిష్ (31 బ్యాటింగ్), హెనిల్ పటేల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
చరిత్ర సృష్టించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా
శ్రీలంక అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ అండర్-19 క్రికెటర్, ఇంగ్లండ్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ సెంచరీతో మెరిశాడు. తద్వారా ఫ్లింటాఫ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రాకీ ఫ్లింటాఫ్ రికార్డులకెక్కాడు.ఫ్లింటాప్ కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 181 బంతులు ఎదుర్కొన్న రాకీ.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫ్లింటాఫ్ తన అద్బుత సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 477 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు కెప్టెన్ హాంజా షేక్(107) సెంచరీతో రాణించాడు. అంతకుముందు శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో వీరసింఘే(77) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో నవ్య శర్మ 5 వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మోర్, బర్నాడ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 324 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన లంక మూడో రోజు లంచ్ విరామానికి 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. -
శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. మైఖేల్ వాన్, ఫ్లింటాఫ్ కుమారుల అరంగేట్రం
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు మైఖేల్ వాన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ కుటుంబాల్లో రెండో తరం వచ్చింది. వీరిద్దరి కుమారులు ఆర్కీ వాన్, రాకీ ఫ్లింటాఫ్ ఒకేసారి ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌తో వీరిద్దరు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నారు.ఆర్కీ, రాకీతో పాటు ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సభ్యులు జో డెన్లీ, రెహాన్ అహ్మద్ సంబంధీకులు కూడా ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. జో డెన్లీ అల్లుడు జైడన్ డెన్లీ.. రెహాన్ అహ్మద్ తమ్ముడు ఫర్హాన్ అహ్మద్ కూడా శ్రీలంక సిరీస్‌లో ఆడనున్నారు.ఆర్కీ వాన్, రాకీ ఫ్లింటాఫ్ విషయానికొస్తే.. ఈ ఇద్దరు అప్‌కమింగ్ క్రికెటర్లు తమ తండ్రుల లాగే బ్యాటింగ్, బౌలింగ్ స్టయిల్లను ఎంచుకున్నారు. ఆర్కీ తన తండ్రి లాగే రైట్ హ్యాండ్ టాపార్డర్ బ్యాటర్ కమ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కాగా.. రాకీ ఫ్లింటాఫ్ తన తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్లా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.ఆర్కీ వాన్, రాకీ ఫ్లింటాఫ్ ఒకేసారి అరంగేట్రం చేస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్కీ, రాకీ ఒకేసారి తమ కెరీర్లు ప్రారంభించనుంటే.. మైఖేల్ వాన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ కలిసి ఇంగ్లండ్ తరఫున 48 టెస్ట్‌లు (1999-2008) ఆడారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్, శ్రీలంక అండర్-19 జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జులై 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జులై 8, 16 తేదీల్లో రెండు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.ఇంగ్లండ్ U19 స్క్వాడ్: హంజా షేక్ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, చార్లీ బ్రాండ్, జాక్ కార్నీ, జైద్న్ డెన్లీ, రాకీ ఫ్లింటాఫ్, కేశ్ ఫోన్సెకా, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, ఎడ్డీ జాక్, ఫ్రెడ్డీ మెక్కాన్, హ్యారీ మూర్, నోహ్ థైన్, ఆర్కీ వాన్. -
భారత్ 431/8 డిక్లేర్డ్
నాగ్‌పూర్: ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరుగుతున్న యూత్ టెస్టు మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లకు 431 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 156/2తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డారిల్ ఫెరారియో (117; 14 ఫోర్లు) ఇతర బ్యాట్స్‌మెన్ సహకారంతో సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. 70 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 23 పరుగులు చేసింది.