
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత జట్టు స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం డెంగ్యూ జ్వరంతో బాధపడతున్న గిల్.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
ఈ క్రమంలో అతడు జట్టుతో కలిసి స్టేడియంకు వెళ్లలేదు. అతడు హోటల్ గదిలోనే ఉండిపోయినట్లు సమాచారం. దీంతో అతడి స్దానంలో మరో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ జట్టులోకి రానున్నట్లు సమాచారం. రోహిత్‌తో కలిసి ఇషాన్ టీమిండియా ఇన్నింగ్స్‌ను ఆరంభించే ఛాన్స్ ఉంది.