వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా తెలుగు తేజం | Shree Charani becomes new No.1 T20I bowler | Sakshi
Sakshi News home page

ICC Rankings: వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా తెలుగు తేజం

Jun 23 2026 4:40 PM | Updated on Jun 23 2026 5:08 PM

Shree Charani becomes new No.1 T20I bowler

ఐసీసీ మ‌హిళ‌ల టీ20 బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో భార‌త యువ స్పిన్న‌ర్‌, తెలుగు తేజం శ్రీచ‌ర‌ణి తొలిసారి నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఉమెన్స్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీచ‌రణి దుమ్ములేపుతోంది. కేవలం మూడు మ్యాచ్‌లలోనే 10 వికెట్లు పడగొట్టింది. 

ఈ అద్బుత ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగానే ఆమె ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్ర పీఠాన్ని అధిరోహించింది. ఈ క‌డ‌ప అమ్మాయి 753 పాయింట్ల‌తో ఇంగ్లండ్ స్టార్ స్పిన్న‌ర్ లిన్సీ స్మిత్‌(726)ను వెన‌క్కి నెట్టి టాప్ ర్యాంక్‌ను కైవ‌సం చేసేకుంది. భార‌త త‌ర‌పున అరంగేట్రం చేసిన ఏడాది లోపే చ‌రణి ఈ అరుదైన ఘ‌న‌త‌ను అందుకోవ‌డం విశేషం.

చ‌రణి భార‌త జ‌ట్టులో ప్ర‌స్తుతం కీల‌క స‌భ్యురాలిగా కొన‌సాగుతోంది. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో హ‌ర్మ‌న్ సేన ఓట‌మి పాలైన‌ప్ప‌టికి.. చ‌రణి మాత్రం మూడు వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తా చాటింది. కాగా గ‌తేడాది భార‌త్ తొలి మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డంలోనూ శ్రీచ‌ర‌ణి ముఖ్య‌ పాత్ర పోషించింది. ఓవరాల్‌గా 21 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన చరణి.. 65 వికెట్లు పడగొట్టింది.
చదవండి: IND vs ENG: భారత జట్టులోకి డేంజరస్‌ ప్లేయర్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement