టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. తలైవా నటించిన తాజా చిత్రం ‘జైలర్ 2’ చూసేందుకు ఏకంగా ఓ థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో కలిసి సినిమా చూశాడు.
రజినీకాంత్ సినిమాలను చూడటమంటే తనకు ఎంతో ఇష్టమని సంజూ తెలిపాడు. ఢిల్లీలో ఓ కార్యక్రమం ఉండటంతో సినిమా విడుదలైన రోజున చూడలేకపోయానని చెప్పాడు. అయితే మరుసటి రోజు థియేటర్ మొత్తాన్ని బుక్ చేసి సతీసమేతంగా సినిమా చూశాడు. ఈ విషయాలను సంజూ స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం అతడు టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లాడు.
కాగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’లో రజినీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించాడు. 2023లో విడుదలైన ‘జైలర్’కు కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు చేస్తోంది.
ఇదీ చదవండి: Jasprit Bumrah: టాప్-10లో ఒకే ఒక్కడు


