26 బంతుల్లో సెంచరీ.. శ్రీలంకను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా | Sandeep Kundu Smashed 26 Ball Century, India Won Their 5th Consecutive T20I Match Against Sri Lanka In Wheel Chair Cricket | Sakshi
Sakshi News home page

26 బంతుల్లో సెంచరీ.. శ్రీలంకను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా

Published Mon, Jun 17 2024 4:59 PM | Last Updated on Mon, Jun 17 2024 6:06 PM

Sandeep Kundu Smashed 26 Ball Century, India Won Their 5th Consecutive T20I Match Against Sri Lanka In Wheel Chair Cricket

పురుషుల వీల్‌ చైర్‌ క్రికెట్‌ టోర్నీలో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 5-0 తేడాతో ​క్లీన్‌ స్వీప్‌ చేసింది. సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 194 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 310 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో సందీప్‌ కుందు, సౌరభ్‌ మాలిక్‌ సెంచరీలతో విరుచుకుపడ్డారు.

అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరి​కి 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా దారుణ ఓటమిని మూటగట్టుకుంది.

26 బంతుల్లో శతక్కొట్టిన సందీప్‌..
ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్‌ సందీప్‌ కుందు కేవలం 26 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయిన కుందు ఇన్నింగ్స్‌ మొత్తంలో 37 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 149 పరుగులు చేశాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement