
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకివ్వగా.. హిట్‌మ్యాన్ బాటలోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నడుస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని కోహ్లి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
విరాట్ తన నిర్ణయాన్ని ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే ఇంగ్లండ్ సిరీస్ వరకు అయినా కొనసాగాలని కోహ్లిని ఒప్పించేందుకు బీసీసీఐ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. కోహ్లి టెస్టుల్లో కొనసాగుతాడా లేదా రోహిత్ బాటలోనే నడుస్తాడా? అన్నది మే 23న తేలిపోనుంది.
ఆ రోజున ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టుతో పాటు కొత్త కెప్టెన్‌ను కూడా బీసీసీఐ ప్రకటించనుంది. కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపిక దాదాపు ఖాయం కాగా.. ప్లేయర్‌గా రోహిత్ శర్మ స్దానాన్నిమాత్రం తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్‌తో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. సాయిసుదర్శన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న సుదర్శన్ పరుగులు వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీలతో 509 పరుగులు చేశాడు. అతడి ఆటను చూసి మాజీలు ఫిదా అయిపోయారు. రవిశాస్రి వంటి దిగ్గజ క్రికెటర్లు సుదర్శన్‌ను ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లను సూచించారు.
దీంతో భారత తరపున వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన సుదర్శన్.. ఇప్పుడు టెస్టుల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. సుదర్శన్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. రంజీ ట్రోఫీ సీజన్లలో తమిళనాడు తరపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 7 సెంచరీలతో 1957 పరుగులు చేశాడు.
సుదర్శన్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 213గా ఉంది. భారత్ తరుపున ఆడిన 3 వన్డేలలో 2 అర్ధ సెంచరీలతో 127 పరుగులు చేశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా అతడికి ఉంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ స్థాన్నాన్ని సుదర్శన్‌తో భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 20 నుంచి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుంది.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్..!