
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం దాదాపు ఖాయమైనట్లే. మ్యాచ్ మూడో రోజు సోమవారం దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 82.5 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌటైంది. వియాన్ ముల్డర్ (206 బంతుల్లో 147; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ కేశవ్ మహరాజ్ (70 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు.
మసకద్జాకు 4 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగుల ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా మొత్తం కలిపి జింబాబ్వే ముందు 537 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. దీనిని ఛేదించే క్రమంలో ఆట ముగిసే సమయానికి జింబాబ్వే ఒక వికెట్ కోల్పోయి 32 పరుగులు చేసింది. ఆ జట్టు మిగిలిన రెండు రోజుల్లో మరో 505 పరుగులు చేయాల్సి ఉంది. టెస్టు క్రికెట్‌లో గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని ఈ లక్ష్యాన్ని జింబాబ్వే అందుకోవడం అసాధ్యమే!
చదవండి: IND vs ENG: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క వికెట్ తేడాతో ఓటమి