భారత్‌, సౌతాఫ్రికా నాలుగో టీ20.. తుది జట్లు ఇవే..! | SA VS IND 4th T20: India Won The Toss And Opt To Bat, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

భారత్‌, సౌతాఫ్రికా నాలుగో టీ20.. తుది జట్లు ఇవే..!

Nov 15 2024 8:13 PM | Updated on Nov 15 2024 8:59 PM

SA VS IND 4th T20: India Won The Toss And Opt To Bat, Here Are Playing XI

జొహనెస్‌బర్గ్‌ వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్‌ 15) జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. మూడో టీ20లో ఆడిన జట్లనే యధాతథంగా బరిలోకి దించుతున్నాయి. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

తుది జట్లు..

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్‌), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్‌), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్‌లేన్‌, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement