విధ్వంసం.. ఒకే ఓవ‌ర్ లో 4,6,6,6,4,6! వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

#Romario Shepherd: విధ్వంసం.. ఒకే ఓవ‌ర్ లో 4,6,6,6,4,6! వీడియో వైరల్‌

Published Sun, Apr 7 2024 5:46 PM

Romario Shepherd Hammers 32 In Last Over Against Anrich Nortje  - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 7వ స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షెపర్డ్ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా ఢిల్లీ పేసర్‌ అన్రిచ్‌ నోర్జేను ఈ కరేబియన్‌ ఉతికారేశాడు. ముంబై ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన నోర్జే బౌలింగ్‌లో 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో రొమారియా ఏకంగా 32 పరుగులు రాబట్టాడు.

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షెపర్డ్.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇన్నాళ్లు ఎక్కడ వున్నావు అన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది సీజన్‌లో రొమారియో షెపర్డ్‌కు ఇదే తొలి మ్యాచ్‌. ఐపీఎల్‌-2024 వేలానికి ముందు షెపర్డ్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ నుంచి ముంబై ట్రేడ్‌ చేసుకుంది.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.  ముంబై బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(49) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. టిమ్‌ డేవిడ్‌(45), ఇషాన్‌ కిషన్‌(42), హార్దిక్‌ పాండ్యా(39), రొమారియో షెపర్డ్(38) పరుగులతో రాణించారు.

Advertisement
Advertisement