టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా రిషబ్ నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (90) సిక్సర్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. పంత్ ఇప్పటివరకు తన టెస్టు కెరీర్‌లో 92 సిక్స్‌లు బాదాడు. కాగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన పంత్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.
24 బంతులు ఎదుర్కొన్న రిషబ్.. 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. మంచి టచ్‌లో కనిపించిన పంత్.. బాష్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు.
51 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. టీమిండియా 6 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(24), అక్షర్ పటేల్(1) ఉన్నారు. రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ వస్తాడో లేదో ఇంకా క్లారిటీ లేదు.
భారత్ తరపున టెస్ట్‌లలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే
రిషబ్ పంత్-92
వీరేంద్ర సెహ్వాగ్-90
రోహిత్ శర్మ-88
రవీంద్ర జడేజా-80
ఎంఎస్ ధోని-70
చదవండి: IND vs SA: టీమిండియాకు ఊహించని షాక్.. ఆట మధ్యలోనే


