Ranji Trophy 2023-24: తొలి రోజు 'ఆంధ్ర'దే.. | Ricky Bhui's Half century helps Andhra commands on day 1 against UP | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2023-24: తొలి రోజు 'ఆంధ్ర'దే..

Feb 10 2024 7:20 AM | Updated on Feb 10 2024 8:58 AM

Ricky Bhui Half century helps Andhra commands in day 1 against Up - Sakshi

సాక్షి, విజయనగరం: ఉత్తరప్రదేశ్‌ జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు నిలకడగా ఆడుతోంది. డాక్టర్‌ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 232 పరుగులు సాధించింది.

ఆల్‌రౌండర్‌ కేవీ శశికాంత్‌ (83 బంతుల్లో 72; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ రికీ భుయ్‌ (90 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. శశికాంత్‌ అవుటయ్యాక రికీ భుయ్‌తో కలిసి కరణ్‌ షిండే (45 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టును ఆదుకున్నాడు. ఐదో వికెట్‌కు రికీ భుయ్, కరణ్‌ అభేద్యంగా 116 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఉత్తరప్రదేశ్‌ బౌలర్లలో యశ్‌ దయాళ్, అంకిత్‌ రాజ్‌పుత్, అకీబ్‌ ఖాన్, సౌరభ్‌ కుమార్‌ ఒక్కో వికెట్‌ తీశారు.
చదవండి: పెత్తనమంతా వాళ్లదే.. మర్యాద తప్పొద్దు! ఏంటి జడ్డూ.. నాన్న గురించి ఇలాగేనా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement