టీమిండియాకు భారీ షాక్‌..! జ‌ట్టులోకి అస్సాం ప్లేయర్‌ | Renuka Singh Thakur Ruled Out Of Zimbabwe ODIs, BCCI Named Replacement | Sakshi
Sakshi News home page

IND vs ZIM: టీమిండియాకు భారీ షాక్‌..! జ‌ట్టులోకి అస్సాం ప్లేయర్‌

Oct 22 2026 8:46 PM | Updated on Oct 22 2026 9:25 PM

Renuka Singh Thakur Ruled Out Of Zimbabwe ODIs, BCCI Named Replacement

జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు భారత మహిళా క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమైంది. గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యలతో బాధపడుతున్న రేణుకా ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.

ఆమె ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో కోలుకుంటుంది. ఆమె ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనప్పటికి పూర్తి స్దాయిలో బౌలింగ్ చేసేందుకు మాత్రం ఇంకా ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలోనే ఆమెను జింబాబ్వే సిరీస్ నుంచి తప్పించారు.

జట్టులోకి 22 ఏళ్ల పేసర్‌
ఇక రేణుకా సింగ్ స్ధానంలో బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ అస్సాంకు చెందిన 22 ఏళ్ల పేసర్ జింటిమని కలితాను ఎంపిక చేసింది. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో భారత జట్టుతో ఉన్న జింటిమని, ఇప్పటికే జట్టుతో కలిసి వడోదర చేరుకుంది. నందిని శర్మ, క్రాంతి గౌడ్, సాయలీ సత్ఘరేలతో కూడిన భారత పేస్ విభాగానికి జింటిమని కలయిక అదనపు బలాన్ని చేకూర్చనుంది. కాగా ఈ సిరీస్ అక్టోబర్ 23 (శుక్రవారం) నుంచి వడోదర వేదికగా ప్రారంభం కానుంది.

జింబాబ్వేతో వ‌న్డేల‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు: స్మృతి మంధాన (కెప్టెన్‌), షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, రిచా ఘోష్, యస్తికా భాటియా,  వైష్ణవి శర్మ, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే, జింటిమణి కలిత.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. టీ20 క్రికెట్‌ హిస్టరీలోనే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement