ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ప్ర‌పంచ రికార్డు.. ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ | Harry Brook Smashes Fastest 200 In ODI Cricket | Sakshi
Sakshi News home page

ENG vs SL: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ప్ర‌పంచ రికార్డు.. ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ

Oct 22 2026 6:03 PM | Updated on Oct 22 2026 6:54 PM

Harry Brook Smashes Fastest 200 In ODI Cricket

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లంక బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకపడ్డ బ్రూక్‌.. కేవలం 114 బంతుల్లోనే తన తొలి డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

దీంతో వ‌న్డే క్రికెట్ హిస్ట‌రీలోనే ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ ప్లేయ‌ర్‌గా బ్రూక్ వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పేరిట ఉండేది. గత నెలలో గువహటి వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో గిల్ 117 బంతుల్లో ద్విశతకం నమోదు చేశాడు. తాజాగా ఈ తుపాన్ ఇన్నింగ్స్‌తో గిల్ రికార్డును బ్రూక్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 116 బంతులు ఎదుర్కొన్న బ్రూక్‌.. 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 202 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇంగ్లండ్ భారీ స్కోర్‌
అతడితో పాటు విల్‌ జాక్స్‌(66), జో రూట్‌(69), టామ్‌ బాంటన్‌(50) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఫలితంగా ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే రెండు, లియాంగే, అషితా ఫెర్నాండో తలా వికెట్ పడగొట్టారు.
చదవండి: IND vs NZ: అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement