హర్మన్‌, షఫాలీ విధ్వంసం.. టీమిండియా 216 పరుగుల భారీ స్కోర్‌ | Harmanpreet Kaur Leads Late Charge With 91 As IND Score 216 | Sakshi
Sakshi News home page

IND vs ZIM: హర్మన్‌, షఫాలీ విధ్వంసం.. టీమిండియా 216 పరుగుల భారీ స్కోర్‌

Oct 20 2026 8:54 PM | Updated on Oct 20 2026 8:54 PM

 Harmanpreet Kaur Leads Late Charge With 91 As IND Score 216

రాయ్‌పూర్‌ వేదికగా జింబాబ్వే మహిళలతో జరుగుతున్న మూడో టీ20లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా మాజీ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఎట్టకేలకు తన విశ్వరూపం చూపించింది. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్‌.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేసింది.

హర్మన్‌ కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు ఓపెనర్‌ షఫాలీ వర్మ మరోసారి మెరుపు హాఫ్‌ సెంచరీతో విరుచుపడింది. కేవలం 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 పరుగులు చేసింది.

ఫలితంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ స్మృతి మంధాన బ్యాటింగ్‌కు రాకపోవడం గమనార్హం. ఇక జింబాబ్వే బౌలర్లలో బిలోవిడ్‌ బీజా మూడు, నయూషా, సిబాండ తలా వికెట్‌ సాధించారు.

తుది జట్లు
జింబాబ్వే మహిళల ప్లేయింగ్ XI: కెలిస్ నడ్లోవు, ప్రియమైన బిజా, చిపో ముగేరి-తిరిపానో, షార్నే మేయర్స్, జోసెఫిన్ న్కోమో (కెప్టెన్‌), న్యాషా గ్వాన్‌జురా, మోడెస్టర్ ముపాచిక్వా (వికెట్‌కీపర్‌), కుడ్జాయ్ చిగోరా, లోరిన్ ఫిరి, టెండై మకుషా, నోమ్వెలో సిబాండా

భారత మహిళా ప్లేయింగ్ XI: స్మృతి మంధాన (కెప్టెన్‌), షఫాలీ వర్మ, అనుష్క శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, నికి ప్రసాద్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, నందనీ శర్మ, క్రాంతి గౌడ్, ప్రేమ రావత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement