క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా 4 వికెట్ల అద్భుత విజయం సాధించింది. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు సరికొత్త చరిత్రను లిఖించుకుంది. టీ20ల్లో టీమిండియాకు ఇదే అత్యధిక విజయవంతమైన లక్ష్య చేధన కావడం విశేషం. ఇంతకుముందు భారత్ రికార్డు ఛేదన 209 పరుగులుగా ఉండగా.. తాజా మ్యాచ్‌తో తన రికార్డును మెన్ ఇన్ బ్లూ మెరుపరుచుకుంది.
టీ20ల్లో టీమిండియా రికార్డ్ లక్ష్య చేధనలు ఇవే
226 vs న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్ (2026)
209 vs ఆస్ట్రేలియా, విశాఖపట్నం (2023)
209 vs న్యూజిలాండ్, రాయ్‌పూర్ (2026)
208 vs వెస్టిండీస్, హైదరాబాద్ (2019)
207 vs శ్రీలంక, మొహాలీ (2009)
204 vs న్యూజిలాండ్, ఆక్లాండ్ (2020)
అదేవిధంగా టీ20ల్లో న్యూజిలాండ్‌పై సెకండ్ హయ్యెస్ట్ ఛేజ్ జట్టుగా భారత్ నిలిచింది. 2018లో ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 245 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది.
సంజూ, నమన్ మెరుపులు
కాగా ఈ మ్యాచ్‌లో కివీస్ నిర్ధేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. ఈ విజయంలో సంజూ శాంసన్ (33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 42), నమన్ ధీర్(15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మైఖేల్ బ్రేస్ వెల్, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే చెరో వికెట్ పడగొట్టారు.
చదవండి: IND vs NZ: ఇన్నాళ్లు ఎక్కడ వున్నావు బ్రో..! టీమిండియాకు దొరికిన అణిముత్యం


