న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా ఘనంగా ప్రారంభించంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య కివీస్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో నమన్ ధీర్ టీమిండియాను గెలిపించాడు. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో వెళ్లింది.

ఫిలిప్స్ ఊచకోత
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిన్ అలెన్(45), బెవాన్ జాకబ్స్(31) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్‌పటేల్, మయాంక్ యాదవ్ తలా వికెట్ పడగొట్టారు.
సంజూ చెడుగుడు.. నమన్ మెరుపులు
అనంతరం 226 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ శుభారంభం అందించారు. వీరిద్దరి ధాటికి భారత్ స్కోర్ పవర్‌ప్లే ముగిసే ఏకంగా 90 పరుగులు దాటింది. అభిషేక్(29) ఔటైనప్పటికి సంజూ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. శాంసన్ కేవలం 33 బంతుల్లోనే 67 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే సంజూ ఔటయ్యాక పరిస్థితి తారుమారైంది.

వవరుస ఓవర్లలో సంజూతో పాటు తిలక్ వర్మ (6), ఇషాన్ కిషన్ (1) తక్కువ పరుగులకే అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. . ఈ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42), అక్షర్ పటేల్ (24) బాధ్యతాయుతంగా ఆడి జట్టును తిరిగి గేమ్‌లోకి తీసుకొచ్చారు. . అయితే లక్ష్యానికి చేరువవుతున్న సమయంలో అక్షర్ పటేల్ అవుట్ కావడంతో మళ్లీ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.
ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన నమన్ ధీర్ (15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ ఔటైనా ఏమాత్రం తడబడకుండా ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రెస్‌వెల్, మిచెల్ శాంట్నర్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.
చదవండి: IND vs NZ: అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు


