జింబాబ్వేను చిత్తు చేసిన భార‌త్‌.. సిరీస్ క్లీన్ స్వీప్‌ | India women beat Zimbabwe women by 92 runs in Raipur 2026 | Sakshi
Sakshi News home page

IND vs ZIM: జింబాబ్వేను చిత్తు చేసిన భార‌త్‌.. సిరీస్ క్లీన్ స్వీప్‌

Oct 20 2026 10:34 PM | Updated on Oct 20 2026 10:35 PM

India women beat Zimbabwe women by 92 runs in Raipur 2026

రాయ్‌పూర్ వేదిక‌గా జింబాబ్వేతో జ‌రిగిన నామమాత్ర‌పు మూడో టీ20లో 92 ప‌రుగుల తేడాతో భార‌త్ మ‌హిళల‌ జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది.  దీంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్‌ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత‌ 20 ఓవర్ల లలో 7 వికెట్ల న‌ష్టానికి 216 భారీ స్కోరు చేశారు. భార‌త్ బ్యాట‌ర్ల‌లో మాజీ కెప్టెన్‌ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌  విధ్వంసక‌ర ఇన్నింగ్స్ ఆడింది.

రాయ‌పూర్ మైదానంలో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను హ‌ర్మ‌న్ ఉతికారేసింది.  హర్మన్‌ కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు ఓపెనర్‌ షఫాలీ వర్మ మరోసారి మెరుపు హాఫ్‌ సెంచరీతో విరుచుపడింది. కేవలం 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 పరుగులు చేసింది.  

అనంత‌రం 217 ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జింబాబ్వే జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 124 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో మేయర్స్(60) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. బీలోవ్డ్ బీజా(44) ఫ‌ర్వాలేద‌న్పించింది. భార‌త బౌల‌ర్ల‌లో నంద‌ని శ‌ర్మ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. క్రాంతి గౌడ్‌, అరుంధ‌తి రెడ్డి, దీప్తి శ‌ర్మ‌, నిక్కీ ప్ర‌సాద్ త‌లా వికెట్ సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement