ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర | Qatar steal historic first World Cup point as Switzerland pay for missed chances | Sakshi
Sakshi News home page

FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర

Jun 14 2026 7:19 AM | Updated on Jun 14 2026 7:23 AM

Qatar steal historic first World Cup point as Switzerland pay for missed chances

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో వేదిక‌గా ఖ‌తార్-స్విట్జ‌ర్లాండ్ వేదిక‌గా జ‌రిగిన గ్రూప్‌-బి మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఖతార్‌కు ఇదే తొలి పాయింట్ కావడం విశేషం. కాగా ఈ మ్యాచ్ ఆరంభం నుంచే స్విట్జర్లాండ్ జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది.  

17వ నిమిషంలో ఖతార్ గోల్‌కీపర్ మహమూద్ అబునాడ ప్రత్యర్థి ఆటగాడిని ఫౌల్ చేయడంతో స్విట్జర్లాండ్‌కు పెనాల్టీ లభించింది. దీనిని బ్రీల్ ఎంబోలో విజయవంతంగా గోల్‌గా మలిచి స్విట్జర్లాండ్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ త‌ర్వాత స్విస్ డిఫెండ‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండ‌డంతో ఖ‌తార్ క‌నీసం గోల్ పోస్ట్ వైపు కూడా సంధించ‌లేక‌పోయింది. 

దీంతో ఖ‌తార్ ఓట‌మి ఖాయ‌మ‌ని అంతా భావించారు. కానీ మ్యాచ్ ముగుస్తుంద‌న్న ఆఖ‌రి క్ష‌ణాల్లో ఖ‌తార్ కెప్టెన్ బౌలెం ఖౌఖీ అద్భుతం చేశాడు.  బౌలెం ఖౌఖీ అత్యంత చాకచక్యంగా హెడర్ ద్వారా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దీంతో స్టేడియంలో ఖతార్ ఆటగాళ్లు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
చదవండి: శుబ్‌మన్‌ గిల్‌ గెలిపించగా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement