సెమీఫైనల్లో ప్రియాన్షు పరాజయం | Priyanshu lost in the semifinals | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో ప్రియాన్షు పరాజయం

Jul 8 2024 4:13 AM | Updated on Jul 8 2024 4:13 AM

Priyanshu lost in the semifinals

కెనడా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ ప్రియాన్షు రజావత్‌ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్‌ ప్రియాన్షు 17–21, 10–21తో ప్రపంచ 37వ ర్యాంకర్‌ అలెక్స్‌ లేనియర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు. 

క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో ర్యాంకర్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)పై సంచలన విజయం సాధించిన ప్రియాన్షు సెమీఫైనల్లో మాత్రం తడబడ్డాడు. ప్రియాన్షుకు 6,090 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షలు), 6,420 పాయింట్లు లభించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement