జర్మనీకి షాక్‌.. ఈక్వెడార్‌ సంచలన విజయం | Plata winning goal Ecuador beat Germany In FIFA World Cup 2026 | Sakshi
Sakshi News home page

జర్మనీకి షాక్‌.. ఈక్వెడార్‌ సంచలన విజయం

Jun 26 2026 8:07 AM | Updated on Jun 26 2026 11:17 AM

Plata winning goal Ecuador beat Germany In FIFA World Cup 2026

ఫిఫా ప్రపంచకప్-2026 మరో సంచలన విజయం నమోదైంది. గ్రూప్-ఈలో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ జర్మనీకి ఈక్వెడార్ భారీ షాక్ ఇచ్చింది. తొలి గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన జర్మనీని ఈక్వెడార్ 2-1తో ఓడించి ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఈక్వెడార్ అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది.

ఇక.. గేమ్‌ విషయానికి వస్తే.. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషానికే జర్మనీ స్టార్ ఆటగాడు లెరాయ్ సానే గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. అయితే ఆ ఆధిక్యం ఎక్కువసేపు నిలవలేదు. కేవలం ఏడు నిమిషాల తర్వాత, 9వ నిమిషంలో నిల్సన్ అంగులో అద్భుతమైన షాట్‌తో ఈక్వెడార్‌కు సమం చేశాడు. దీంతో తొలి అర్ధభాగం 1-1తో ముగిసింది.

రెండో అర్ధభాగంలో ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా పోరాడాయి. చివరకు 77వ నిమిషంలో గోంజాలో ప్లాటా కార్నర్‌ అవకాశాన్ని అద్భుతంగా గోల్‌గా మలిచి ఈక్వెడార్‌కు 2-1 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత జర్మనీ సమం చేయడానికి చేసిన ప్రయత్నాలను ఈక్వెడార్ అడ్డుకోవడంతో మ్యాచ్ ఈక్వెడార్ ఖాతాలో పడింది.

ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో గోల్ కూడా చేయలేక విమర్శలు ఎదుర్కొన్న ఈక్వెడార్, అత్యంత కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ఆటతీరును కనబరిచింది. ముఖ్యంగా మోయిసెస్ కైసెడో, హెర్నాన్ గలీందెజ్, విలియన్ పాచో రక్షణలో కీలక పాత్ర పోషించారు. కోచ్ సెబాస్టియన్ బెక్కాసెసె కూడా జట్టు ప్రదర్శనపై భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఓటమి జర్మనీకి టోర్నీలో తొలి పరాజయమైనప్పటికీ, ఇప్పటికే నాకౌట్ దశకు అర్హత సాధించినందున వారి ప్రయాణంపై ప్రభావం చూపలేదు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ విజయంతో ప్రపంచకప్‌లో చారిత్రాత్మక ముందడుగు వేసి అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement