Paris Olympics: మెరిసిన అంకిత.. క్వార్టర్ ఫైనల్లో భారత ఆర్చరీ టీమ్‌ | Paris Olympics: India womens team enters quarterfinals in Archery | Sakshi
Sakshi News home page

Paris Olympics: మెరిసిన అంకిత.. క్వార్టర్ ఫైనల్లో భారత ఆర్చరీ టీమ్‌

Jul 25 2024 4:06 PM | Updated on Jul 25 2024 4:21 PM

Paris Olympics: India womens team enters quarterfinals in Archery

ప్యారిస్ ఒలింపిక్స్‌లో భార‌త మ‌హిళ ఆర్చ‌ర్లు శుభారంభం చేశారు. టీమ్ ఈవెంట్‌లో అంకితా భకత్, భజన్ కౌర్, దీపికా కుమారి త్రయంతో కూడిన భార‌త ఆర్చ‌రీ జ‌ట్టు క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్ ఈవెంట్‌లో ఈ భార‌త త్ర‌యం నాలుగో స్ధానంలో నిల‌వ‌డంతో నేరుగా క్వార్టర్ ఫైన‌ల్‌కు ఆర్హ‌త సాధించింది.

ఈ ఈవెంట్‌లో భార‌త్ ఓవ‌రాల్‌గా 1983 పాయింట్లు సాధించి నాలుగో స్ధానంలో నిలిచింది. భారత బృందంలో తొలిసారి ఒలింపిక్స్‌లో భాగమైన యువ ఆర్చర్ అంకిత భకత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అంకిత భకత్ 666 పాయింట్లతో 11వ స్ధానంలో నిలిచి సత్తాచాటింది. 

ఆమెతో పాటు భజన్‌ కౌర్‌(659 పాయింట్లు), దీపికా కుమారి(658 పాయింట్లు) వరుసగా 22, 23వ స్ధానాల్లో నిలిచారు. ఇక సీడింగ్ నిర్ణయాత్మక ఈవెంట్‌లో కొరియా 2046 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 

చైనా(1996 పాయింట్లు), మెక్సికో(1986 పాయింట్లు) వరుసగా రెండు మూడు స్ధానాల్లో నిలిచాయి. భారత్ మరో 3 పాయింట్లు సాధించి ఉంటే మెక్సికోను ఆధిగమించి టాప్‌-3లో చోటు ఖాయం​ చేసుకుండేది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement