నిశాంత్ దేవ్ 'పంచ్' మిస్‌.. క్వార్ట‌ర్స్‌లో ఓట‌మి | Paris Olympics 2024: Boxer Nishant Dev loses in 71kg quarterfinals | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: నిశాంత్ దేవ్ 'పంచ్' మిస్‌.. క్వార్ట‌ర్స్‌లో ఓట‌మి

Aug 4 2024 9:11 AM | Updated on Aug 4 2024 9:17 AM

Paris Olympics 2024: Boxer Nishant Dev loses in 71kg quarterfinals

ప్యారిస్ ఒలింపిక్స్-2024 బాక్సింగ్‌లో భార‌త్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. శ‌నివారం ఆర్ధ‌రాత్రి జరిగిన పురుషుల 71 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ ఘోర పరాజయాన్ని చవిచూశాడు.

మెక్సికో బాక్స‌ర్ మార్కో వెర్డే అల్వారెజ్ చేతిలో 1-4 తేడాతో నిశాంత్ దేవ్ ఓట‌మి పాల‌య్యాడు. మొద‌టి రౌండ్‌లో నిశాంత్ దూకుడుక‌న‌బ‌రచిన‌ప్ప‌ట‌కి.. తర్వాతి మూడు రౌండ్ల‌లో ప్ర‌త్య‌ర్ధి పుంజుకుని అద్భుత విజయం సాధించాడు. అంత‌క‌ముందు మ‌హిళ‌ల విభాగంలో భార‌త స్టార్ బాక్స‌ర్, హైద‌రాబాదీ నిఖ‌త్ జ‌రీన్ సైతం ఇంటిముఖం ప‌ట్టింది.

మహిళల 50 కేజీల ప్రి క్వార్టర్స్‌లో వు హు (చైనా) చేతిలో  0-5 తేడాతో జ‌రీన్ ఓట‌మిపాలైంది. ఇప్పుడు వీరిద్ద‌రి ఓట‌మితో బాక్సింగ్‌లో ప‌త‌కంపై భార‌త్ ఆశ‌లు స్టార్ మ‌హిళా బాక్స‌ర్ ల‌వ్లీనా బొర్గోహైన్ ప్ర‌ద‌ర్శ‌న‌పై ఆధార‌ప‌డి ఉన్నాయి. ఆదివారం మహిళల 75 కేజీల క్వార్టర్‌ ఫైనల్లో లి కియాన్‌ (చైనా)తో లవ్లీనా త‌ల‌ప‌డ‌నుంది.

Advertisement
 
Advertisement
Advertisement