ఆస్ట్రేలియాతో చారిత్రక సిరీస్‌కు ముందు పాక్‌కు ఎదురు దెబ్బ.. కీలక ఆటగాడికి కరోనా | Pakistan Vs Australia 1st Test: Haris Rauf Tests Positive For Covid | Sakshi
Sakshi News home page

PAK VS AUS: ఆస్ట్రేలియాతో చారిత్రక సిరీస్‌కు ముందు పాక్‌కు ఎదురు దెబ్బ.. కీలక ఆటగాడికి కరోనా

Mar 1 2022 9:30 PM | Updated on Mar 1 2022 9:31 PM

Pakistan Vs Australia 1st Test: Haris Rauf Tests Positive For Covid - Sakshi

Haris Rauf Tests Positive For Covid: త్వరలో ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న చారిత్రక టెస్ట్‌ సిరీస్‌కు ముందు ఆతిధ్య పాకిస్థాన్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్‌ కరోనా బారిన పడి తొలి టెస్ట్‌కు దూరమయ్యాడు. రౌఫ్‌తో పాటు సన్నిహితంగా మెలిగిన  స్టార్‌ పేసర్‌ షాహీన్ అఫ్రిది కూడా ఐసోలేషన్ కు వెళ్లాడు. దీంతో అఫ్రిది కూడా తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. కాగా, 24 ఏళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత పాక్ గ‌డ్డ‌పై ఆసీస్‌ క్రికెట్‌ జట్టు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 

పాట్ క‌మిన్స్ సార‌ధ్యంలోని ఆస్ట్రేలియా జ‌ట్టు ఈ ప‌ర్య‌ట‌న‌లో 3 టెస్ట్‌లు, 3 వ‌న్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. మార్చి 4న రావల్పిండి వేదిక‌గా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే,  పాక్ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన‌ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సిరీస్ ప్రారంభానికి ముందే బెదిరింపుల ప‌ర్వం మొద‌లైంది. పాక్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తే నీ భ‌ర్త ప్రాణాల‌తో తిరిగిరాడంటూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ ఆస్ట‌న్ అగ‌ర్‌ భార్యకు సోష‌ల్‌మీడియా వేదిక‌గా బెదిరింపు సందేశం వచ్చింది. ఈ విష‌య‌మై అగ‌ర్ భార్య మెడిలీన్ క్రికెట్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులకు ఫిర్యాదు చేయ‌గా, ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సంయుక్తంగా విచారణ చేపట్టాయి. 
చదవండి: పాక్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తే నీ భ‌ర్త ప్రాణాల‌తో తిరిగిరాడు.. ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement