ఓటమి బాధతో బాబర్‌ ఏడ్చాడు.. తప్పు అతనొక్కడిదే కాదు: పాకిస్తాన్‌ లెజెండ్‌ | Pakistan Legend Mohammed Yousuf Claims Babar Azam Cried After Loss To Afghanistan In 2023 World Cup Match - Sakshi
Sakshi News home page

World Cup 2023: ఓటమి బాధతో బాబర్‌ ఏడ్చాడు.. తప్పు అతనొక్కడిదే కాదు: పాకిస్తాన్‌ లెజెండ్‌

Published Wed, Oct 25 2023 3:32 PM

Pakistan legend claims Babar Azam cried after loss to Afghanistan in 2023 World Cup - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌ చేతిలో పాకిస్తాన్‌ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో పా​​క్‌ను 8 వికెట్ల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ చిత్తు చేసింది. వన్డేల్లో ఆఫ్గాన్‌ చేతిలో పాక్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.

ఈ ఓటమి బాధ్యడిగా బాబర్‌ ఆజంను కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాక్‌ మజీ క్రికెటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బాబర్‌కు మద్దతుగా పాక్‌ మాజీ ఆటగాడు మహ్మద్‌ యూసఫ్ నిలిచాడు. ఈ ఓటమికి బాబర్ ఒక్కడే కాదు జట్టు మొత్తం బాధ్యత వహించాలని యూసఫ్ అభిప్రాయడ్డాడు.

"ఆఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌ అనంతరం బాబర్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి ఏడ్చినట్లు నాకు తెలిసింది. ఈ ఓటమికి బాబర్‌ ఒక్కడే కారణం కాదు. మొత్తం జట్టుతో పాటు మేనేజ్‌మెంట్‌ తప్పుకూడా ఉంది. ఇటువంటి సమయంలో మేముంతా బాబర్‌కు సపోర్ట్‌గా ఉంటాం.

దేశం మొత్తం అతనితో ఉందని" పాకిస్తానీ టీవీ షోలో యూసఫ్‌ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు పాకిస్తాన్‌.. రెండింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: Muttiah Muralitharan: తండ్రి బేకరీ వ్యాపారం.. అడుగడుగునా అవమానాలు.. దోషిలా విచారణ! 800వ వికెట్‌ అతడే..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement