
కరాచీ: భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆసియా కప్‌లో ఆడేందుకు తమ జట్టుకు భారత్‌కు పంపించడం లేదని పాక్ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్) ప్రకటించింది. ఈ విషయాన్ని ఇప్పటికే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)కు దీనికి సంబంధించి సమాచారం అందించినట్లు పీహెచ్‌ఎఫ్ పేర్కొంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో ఆడితే మా జట్టుకు భద్రతాపరమైన సమస్యలు ఎదురు కావచ్చు. అక్కడ జరిగే ఆసియా కప్‌లో పాల్గొనేందుకు మా ఆటగాళ్లు కూడా వెనుకంజ వేస్తున్నారు. మా భద్రతపై హామీ ఇస్తేనే మేం టోరీ్నపై దృష్టి పెట్టగలం. ఇదే విషయాన్ని ఎఫ్‌ఐహెచ్‌కు వెల్లడించాం’ అని పీహెచ్‌ఎఫ్ అధ్యక్షుడు తారిఖ్ బుగ్తీ స్పష్టం చేశారు.