పారిస్ ఒలింపిక్స్ సమయంలో భారత పురుషుల హాకీ జట్టు సభ్యుల మానసిక దృఢత్వం కోసం... దక్షిణాఫ్రికాకు చెందిన విఖ్యాత మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ సేవలు తీసుకోవాలని హాకీ ఇండియా నిర్ణయం తీసుకుంది.
2011లో వన్డే ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత క్రికెట్ జట్టుకు ప్యాడీ ఆప్టన్ మెంటల్  కండీషనింగ్ కోచ్‌గా ఉన్నారు. ఇటీవల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా క్రీడల సమయంలోనూ ఆప్టన్ భారత హాకీ జట్టు వెంబడి ఉన్నారు. 
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
