CWC 2023 Final: కోహ్లి కాదు!.. అతడి కోసం మేము కచ్చితంగా గెలవాల్సిందే: రోహిత్‌ శర్మ

Not Kohli: Rohit Sharma Wants India To Win ODI WC 2023 For This Man - Sakshi

ICC CWC 2023 Final ind Vs Aus: వన్డే వరల్డ్‌కప్‌- 2011లో మహేంద్ర సింగ్‌ ధోని నాయకత్వంలోని భారత జట్టు ట్రోఫీ గెలిచి ఆ విజయాన్ని దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌కు అంకితం చేసింది.. విరాట్‌ కోహ్లి వంటి యువ ఆటగాడు సహా జట్టులోని ఇతర సభ్యులు ‘క్రికెట్‌ దేవుడి’ని తమ భుజాలపై మోస్తూ.. వాంఖడే స్టేడియమంతా తిప్పి సముచితంగా గౌరవించుకున్నారు.

రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌లో ఒక్కసారి కూడా వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలవలేదన్న లోటు.. సచిన్‌కు అలా ఆరో ప్రయత్నంలో తీరింది. కెరీర్‌లో ఆఖరి వన్డే ప్రపంచకప్‌ ఆడుతున్న అత్యుత్తమ ఆటగాడికి సొంతగడ్డపై.. అదీ అతడి సొంతమైదానంలో సహచరులు అలా గొప్ప కానుక అందించారు.

మళ్లీ పుష్కరకాలం తర్వాత భారత గడ్డపై వన్డే ప్రపంచకప్‌ టోర్నీ.. పది విజయాలతో టాప్‌గేర్‌లో ఫైనల్‌కు దూసుకువచ్చిన టీమిండియా ఆఖరి పోరులో ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగునంది.

ఈ నేపథ్యంలో.. నాడు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌కు దక్కిన గౌరవం.. క్రికెట్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లికి దక్కితే చూడాలని అతడి అభిమానులు ఆశపడుతున్నారు. ఆసీస్‌ను చిత్తు చేసి టీమిండియా ట్రోఫీని ముద్దాడితే.. ఆ అపురూప క్షణాల్లో తమ రికార్డుల రారాజుకు కూడా.. నాడు సచిన్‌ మాదిరే పట్టం కట్టాలని ఆకాంక్షిస్తున్నారు.

కోహ్లికి ఈ విజయాన్ని అంకితం చేయాలని కోరుకుంటున్నారు. చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం 35 ఏళ్ల కోహ్లి కోసం భారత జట్టు టైటిల్‌ గెలిస్తే చూడాలని ఉందనే ఆకాంక్షను వెలిబుచ్చారు. అయితే, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 

ఈసారి భారత జట్టు తమ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కోసం కప్పు గెలవాలని కోరుకుంటోందని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. ద్రవిడ్‌ కెరీర్‌లో మిగిలిపోయిన లోటును తీర్చాలనుకంటున్నట్లు తెలిపాడు. కాగా 2003లో సౌరవ్‌ గంగూలీ సారథ్యంలోని భారత జట్టులో రాహుల్‌ ద్రవిడ్‌ సభ్యుడు.

సౌతాఫ్రికా వేదికగా జొహన్నస్‌బర్గ్‌లో జరిగిన నాటి ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా తలపడ్డాయి. అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ 140, డామిన్‌ మార్టిన్‌ 88 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు 359 పరుగుల భారీ స్కోరు అందించారు.

అయితే, టీమిండియా టాపార్డర్‌లో ఓపెనర్‌ సచిన్‌ టెండుల్కర్‌ (4), వన్‌డౌన్‌ బ్యాటర్‌ గంగూలీ(24) విఫలం కాగా మరో ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 82 పరుగులు సాధించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన రాహుల్‌ ద్రవిడ్‌ 47 పరుగులు రాబట్టాడు.

వీరిద్దరు మినహా మిగతా వాళ్లంతా కనీసం ముప్పై పరుగుల మార్కును దాటకపోవడంతో 234 పరుగులకే పరిమితమైంది టీమిండియా. దీంతో 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. అలా నాడు కంగారూల చేతిలో టీమిండియాకు పరాభవం ఎదురైంది.

కాలక్రమంలో ఇరవై ఏళ్ల తర్వాత.. నాటి భారత జట్టులో సభ్యుడైన ద్రవిడ్‌ మార్గదర్శనంలోని టీమిండియా ఇప్పుడు ఫైనల్‌కు చేరుకుంది. అదే ప్రత్యర్థితో మరోసారి తుదిపోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ గెలిచి ద్రవిడ్‌కు అంకితం చేయాలని రోహిత్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు.. ‘‘మేము ఇక్కడి దాకా చేరుకోవడంలో రాహుల్‌ భయ్యా పాత్ర ఎంతో కీలకం. ఆయన తన కెరీర్‌లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడారు. కోచ్‌గా ఉన్నప్పటికీ మాకు కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తూనే ఎలా ఆడాలో కూడా మార్గదర్శనం చేస్తారు.

గడ్డు పరిస్థితుల్లో ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్‌ సమయంలో మాకు ఆయన నైతికంగా ఎంతో మద్దతుగా నిలిచారు. సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత మా లోపాలు సరిచేసి ఎలా ముందుకుసాగాలో నేర్పించారు. ఇలాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఆయన కోసం మేము కచ్చితంగా గెలిచి తీరాల్సిందే’’ అని రోహిత్‌ శర్మ రాహుల్‌ ద్రవిడ్‌పై అభిమానం చాటుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

19-11-2023
Nov 19, 2023, 14:00 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌కు విజిల్‌  మోగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియా- భారత జట్లు తలపడతున్నాయి. ఈ...
19-11-2023
Nov 19, 2023, 13:03 IST
ICC CWC 2023 Final- Ind vs Aus: ‘‘పన్నెండేళ్ల క్రితం (2011) ఫైనల్‌ ముందు రోజు ఏప్రిల్‌ ఫూల్స్‌...
19-11-2023
Nov 19, 2023, 11:40 IST
దేశమంతా క్రికెట్‌ ఫీవర్‌తో ఊగిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా మనమంతా టీమిండియా అభిమానులం అన్న చందంగా టీమిండియాకు...
19-11-2023
Nov 19, 2023, 11:31 IST
సాక్షి, హైదరాబాద్‌: క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. మరికొన్ని గంటల్లో వన్డే వరల్డ్‌-2023 ఫైనల్‌ పోరుకు తెరలేవనుంది....
19-11-2023
Nov 19, 2023, 11:04 IST
పుష్కర కాలంగా ఎదురుచూస్తున్న ఉద్విగ్న ఘట్టానికి టీమ్‌ ఇండియా ఒక్క అడుగు దూరంలోనే ఉంది. భారత క్రికెట్‌ చరిత్రలో ముచ్చటగా...
19-11-2023
Nov 19, 2023, 10:58 IST
ICC CWC Final 2023: క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్‌-2023 తుది‌ సమరానికి సమయం...
19-11-2023
Nov 19, 2023, 10:18 IST
ICC CWC 2023 Final- Pat Cummins Comments Ahead Big Clash: వన్డే వరల్డ్‌కప్‌-2023 ఆరంభంలో పరాజయాల పాలైన...
19-11-2023
Nov 19, 2023, 10:04 IST
వన్డే ప్రపంచకప్‌-2023 మెగా ఫైనల్‌కు సర్వం సిద్దమైంది.  ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న తుది పోరులో...
19-11-2023
Nov 19, 2023, 09:32 IST
వన్డే వరల్డ్‌కప్‌-2011.. జట్టులో చోటే కరువు.. 2023లో ఏకంగా కెప్టెన్‌గా బరిలోకి.. లీగ్‌ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిపించిన...
19-11-2023
Nov 19, 2023, 08:13 IST
ICC CWC 2023 Final Ind Vs Aus: ఒక్క అడుగు.. ఇంకొక్క అడుగు విజయవంతంగా ముందుకు వేస్తే పుష్కర కాలం...
19-11-2023
Nov 19, 2023, 04:15 IST
రోహిత్‌ మెరుపు ప్రదర్శనలు... కోహ్లి అద్భుత బ్యాటింగ్‌ విన్యాసాలు... శ్రేయస్, రాహుల్‌  దూకుడు... షమీ వికెట్ల వరద... జడేజా ఆల్‌రౌండ్‌...
19-11-2023
Nov 19, 2023, 04:09 IST
ఆట మొదలవ్వాలంటే ముందు టాస్‌ పడాలి. కానీ ఈ టాస్‌ కంటే ముందు కనువిందు చేసే విన్యాసాలెన్నో నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఆద్యంతం...
18-11-2023
Nov 18, 2023, 21:14 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌కు అంతా సిద్దమైంది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి....
18-11-2023
Nov 18, 2023, 20:07 IST
క్రికెట్‌ అభిమానులు ఏంతో అతృతగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ పోరుకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే...
18-11-2023
Nov 18, 2023, 18:46 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో తుది సమరానికి మరి కొన్ని గంటల మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో...
18-11-2023
Nov 18, 2023, 18:45 IST
ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవరే కనిపిస్తోంది. 2011 తర్వాత వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కి వెళ్లడం,...
18-11-2023
Nov 18, 2023, 17:34 IST
మూడో వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌కు టీమిండియా మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌-2023...
18-11-2023
Nov 18, 2023, 16:44 IST
వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్ పోరుకు సమయం అసన్నమైంది. ఆదివారం(నవంబర్‌ 19)న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు...
18-11-2023
Nov 18, 2023, 16:00 IST
ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుగ్రామం.. సహాస్‌పూర్‌కు చెందిన తౌసీఫ్‌ అలీ యువకుడిగా ఉన్న సమయంలో ఫాస్ట్‌బౌలర్‌గా గుర్తింపు పొందాడు.. మరి తనకున్న...
18-11-2023
Nov 18, 2023, 15:30 IST
క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌-ఆస్ట్రేలియా ప్రపంచకప్‌-2023 ఫైనల్‌కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్‌ వేదికగా మరో 24 గంటల్లో...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top