నికోలస్ పూరన్ వరల్డ్ రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే | Nicholas Pooran breaks Mohammad Rizwans world record in T20s | Sakshi
Sakshi News home page

CPL: నికోలస్ పూరన్ వరల్డ్ రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే

Sep 28 2024 6:49 PM | Updated on Sep 28 2024 7:34 PM

Nicholas Pooran breaks Mohammad Rizwans world record in T20s

వెస్టిండీస్ స్టార్ ఆట‌గాడు నికోల‌స్ పూర‌న్ టీ20 క్రికెట్‌లో అద‌ర‌గొడుతున్నాడు. ప్ర‌స్తుతం కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ తరపున ఆడుతున్న పూరన్‌.. తాజా ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు. శనివారం సీపీఎల్‌లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగులు చేసిన పూరన్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ ఏడాది టీ20ల్లో  ఇప్పటివరకు 65 ఇన్నింగ్స్‌ల్లో 42.02 సగటుతో 2,059 పరుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. కాగా ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది. 

2021 ఏడాదిలో 45 టీ20 ఇన్నింగ్స్‌లలో 2,036 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో రిజ్వాన్ ఆల్‌టైమ్ రి​కార్డును ఈ కరేబియన్ విధ్వంసకర వీరుడు బ్రేక్ చేశాడు. ఈ ఏడాదిలో టీ20ల్లో వెస్టిండీస్‌, డర్బన్ సూపర్ జెయింట్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ న్యూయార్క్, నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, రంగ్‌పూర్ రైడర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ జట్లకు పూరన్ ప్రాతినిథ్యం వహించాడు.

Advertisement
 
Advertisement
Advertisement