భారత్‌తో నాలుగో టీ20.. విండీస్‌ సరికొత్త రికార్డు | West Indies Create New T20I Powerplay Record vs India In Hyderabad | Sakshi
Sakshi News home page

భారత్‌తో నాలుగో టీ20.. విండీస్‌ సరికొత్త రికార్డు

Oct 14 2026 8:10 PM | Updated on Oct 14 2026 8:26 PM

West Indies Create New T20I Powerplay Record vs India In Hyderabad

source: X

హైదరాబాద్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో​ వెస్టిండీస్‌ జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు ధాటిగా ఆడుతుంది. ఈ క్రమంలో పవర్‌ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) భారీ స్కోర్‌ (79-1) సాధించి, సరికొత్త రికార్డు సృష్టించింది.

భారత్‌పై టీ20 పవర్‌ ప్లేలో విండీస్‌కు ఇదే అత్యధిక స్కోర్‌. 2016లో లాడర్‌హిల్‌లో వికెట్‌ నష్టపోకుండా చేసిన 78 పరుగులే దీనికి ముందు అత్యధిక పవర్‌ ప్లే స్కోర్‌గా ఉండింది. హైదరాబాద్‌ టీ20లో విండీస్‌ ఆ రికార్డును బద్దలు కొట్టింది.

పవర్‌ ప్లే తర్వాత కూడా దూకుడుగా ఆడుతున్న విండీస్‌ బ్యాటర్లు జట్టును భారీ స్కోర్‌ దిశగా తీసుకెళ్తున్నారు. 12.5 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 156-3గా ఉంది. జువెల్‌ ఆండ్రూ (21), హెట్‌మైర్‌ (33), రోవ్‌మన్‌ పావెల్‌ (24) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఔట్‌ కాగా.. హోప్‌ (63), రూథర్‌ఫోర్డ్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. 

భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌కు తలో వికెట్‌ దక్కింది. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

భారత్‌పై సంయుక్త పవర్‌ప్లే రికార్డు
ఓవరాల్‌గా కూడా విండీస్‌ భారత్‌పై సంయుక్త పవర్‌ప్లే రికార్డు సాధించింది. ఈ మ్యాచ్‌ పవర్‌ ప్లేలో విండీస్‌ చేసిన 79-1 స్కోర్‌, భారత్‌పై ఏ జట్టైనా చేసిన అత్యధిక స్కోర్‌గా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో తిరువనంతపురంలో న్యూజిలాండ్ కూడా భారత్‌పై 79-1 స్కోర్‌ చేసింది. ఈ రికార్డును విండీస్‌ ఈ మ్యాచ్‌లో సమం చేసింది. 

ఇదీ చదవండి: ఎస్‌ఆర్‌హెచ్‌లోకి స్టార్‌ ప్లేయర్‌ రీఎంట్రీ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement