బుమ్రా విష‌యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం! | Reports-Bumrah Likely Rest-ODI Series Vs NZ-Due-To Work-Load-BCCI | Sakshi
Sakshi News home page

బుమ్రా విష‌యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం!

Oct 16 2026 1:52 PM | Updated on Oct 16 2026 2:14 PM

Reports-Bumrah Likely Rest-ODI Series Vs NZ-Due-To Work-Load-BCCI

Photo Credit: Twitter

భారత‌ స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా విష‌యంలో బీసీసీఐ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మూడు ఫార్మాట్ల‌లో కీల‌క బౌల‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బుమ్రాపై వ‌ర్క్‌లోడ్ పెరిగిపోతున్న నేప‌థ్యంలో బీసీసీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది. అక్టోబ‌ర్‌లో మొద‌లుకానున్న న్యూజిలాండ్ టూర్ డిసెంబ‌ర్ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. 

ఈ టూర్‌లో భార‌త్ ఐదు టీ20లు, ఐదు వ‌న్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఈ సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌లో బుమ్రా కీల‌కం కానున్నాడు. దీంతో అత‌డిని వ‌న్డేల‌కు దూరంగా ఉంచాల‌ని బీసీసీఐ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ టూర్‌లో మొదట ఇరుజట్ల మధ్య ఈ నెల 22-నవంబర్‌ 1 మధ్య ఐదు టీ20లు జరుగనుంది. మూడు రోజుల విరామం తర్వాత వన్డే సిరీస్‌ అవుతుంది. 

నవంబర్‌ 15న వన్డే సిరీస్‌ ముగియనుండగా 19 నుంచి టెస్టులు మొదలవ్వాల్సి ఉంది. అయితే వన్డేలు ముగిసిన వెంటనే టెస్టులకు సిద్ధమవడం వ‌ల్ల‌ బుమ్రాపై పడే వర్క్‌లోడ్‌ అతడిపై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశ‌ముంది. అందుకే భార‌త స్పీడ‌స్ట‌ర్‌కు వన్డేలకు విశ్రాంతినిచ్చి టెస్టులకు సన్నాహకంగా భారత్‌-ఏ జట్టు ఆడబోయే ఒక మ్యాచ్‌లో ఆడించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

దీనిపై బోర్డు ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘బుమ్రా ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. రాబోయే కివీస్‌ టూర్‌లో అతడిని ఏ ఫార్మాట్‌లో ఆడించాలనేది అత్యంత కీలకం. అయితే వన్డేలు ఆడిన వెంటనే టెస్టులకు తీసుకురావడం బుమ్రాకు పనిభారం పెంచడమే. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ కీలకం. అది ముగిశాక వచ్చే ఏడాది బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ కూడా ఉంది. 

ఇటువంటి కీలక సిరీస్‌ల దృష్ట్యా బుమ్రాను ముఖ్యమైన మ్యాచ్‌లలోనే బరిలోకి దింపాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నది’ అని తెలిపాడు. కాగా జ‌పాన్‌లో జ‌రిగిన ఆసియా గేమ్స్‌లో స్వ‌ర్ణం గెలిచిన టీమిండియా జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్న బుమ్రాకు బీసీసీఐ ప్ర‌స్తుతం స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చింది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement