breaking news
workload
-
‘పని భారం’ను పక్కన పెట్టాల్సిందే!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఒక కీలక అంశం భారత క్రికెట్లో చర్చకు వచ్చింది. గత కొంత కాలంగా బీసీసీఐ ప్రధాన ఆటగాళ్లకు ‘పనిభారం’ ఎక్కువగా ఉంటుందని, వారికి మ్యాచ్‌లు, సిరీస్‌ల మధ్యలో తగినంత ‘విశ్రాంతి’ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలో టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో సిరీస్‌తో మూడు టెస్టులే ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ ముందే ప్రకటించింది. చివరకు అదే జరిగింది. అయితే తొలి టెస్టు తర్వాత వారం రోజుల విరామం వచ్చినా బుమ్రా రెండో టెస్టు ఆడకపోవడం, కీలకమైన, సిరీస్‌ను సమం చేయాల్సిన చివరి టెస్టుకు కూడా అతను దూరం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు ఎలాంటి విరామం లేకుండా పూర్తి ఫిట్నెస్తో మొహమ్మద్ సిరాజ్ ఐదు టెస్టులూ ఆడి వేయికి పైగా బంతులు వేయడం ఈ అంశాన్ని మరింతగా చర్చించేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఇకపై ‘పనిభారం’ పేరుతో ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరం కాకుండా నిబంధనలు విధించాలని బోర్డు యోచిస్తోంది. దీంతో పాటు కొందరు క్రికెటర్లు ప్రత్యేక హోదాను ప్రదర్శిస్తూ తమకు నచ్చిన మ్యాచ్‌లు ఎంచుకుంటూ మిగతా కొన్ని మ్యాచ్‌ల నుంచి వేర్వేరు కారణాలతో తప్పుకుంటున్నారు. దీనికి కూడా ఫుల్స్టాప్ పెట్టే ప్రతిపాదన ఉందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.‘సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరికీ ఈ సమాచారం అందిస్తాం. ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో రెగ్యులర్‌గా ఆడే ప్లేయర్లు ఇకపై తమ ఇష్టానుసారం మ్యాచ్‌లను ఎంపిక చేసుకునే వీలుండదు’ అని ఆయన అన్నారు. ‘పనిభారం’ అంటూ ఆటగాళ్లను మ్యాచ్‌లకు దూరం పెట్టే విషయంపై కూడా సరైన రీతిలో చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ‘పేస్ బౌలర్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందనేది వాస్తవం. ఈ విషయంలో వైద్యబృందం సలహాలతోనే ముందుకు వెళతాం. అయితే పనిభారం పేరుతో కీలక మ్యాచ్‌లకు దూరం కావడం మాత్రం జరగదు. ఆటకంటే ఆటగాళ్లు ఎక్కువ కాదని సందేశం అందరికీ వెళ్లాలి’ అని ఆయన పేర్కొన్నారు. దేశం కోసం ఆడుతున్నప్పుడు... మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా ‘పనిభారం’ విషయంలో ఘాటుగా స్పందించారు. ‘దేశం కోసం ఆడుతున్నప్పుడు గాయం, నొప్పిలాంటివాటిని మర్చిపోవాలి. సరిహద్దుల్లో చలి ఎక్కువగా ఉందని సైనికులు ఫిర్యాదు చేస్తున్నారా. పంత్ ఫ్రాక్చర్‌తో ఆడేందుకు సిద్ధమయ్యాడు. అలాంటి తత్వం ఆటగాళ్ళలో ఉండాలి. కోట్లాది మంది భారతీయులకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.సిరాజ్ ఐదు టెస్టుల్లోనూ కెప్టెన్ అడిగిన ప్రతీసారి 7–8 ఓవర్ల స్పెల్‌లు బౌలింగ్ చేశాడు. అసలు ‘పనిభారం’ అనే చర్చనే అతను తీసిపడేశాడు. నేను చాలా కాలంగా చెబుతున్నా. ఈ పదాన్ని భారత క్రికెట్ డిక్షనరీ నుంచి పూర్తిగా తొలగించాలి’ అని గావస్కర్ అభిప్రాయపడ్డారు.సిరీస్ విజయంతో స్వదేశానికి... న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఓవల్‌లో చివరి టెస్టు ముగిసిన తర్వాత భారత క్రికెటర్లు ప్రత్యేకంగా ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. సుదీర్ఘ సిరీస్ ముగిసిన వెంటనే జట్టును వీడేందుకు సిద్ధమయ్యారు. కొందరు విశ్రాంతి కోసం ఇంగ్లండ్‌లోనే ఆగిపోయేందుకు సిద్ధపడగా...మరికొందరు సాధ్యమైనంత తొందరగా అందుబాటులో ఉన్న ఫ్లయిట్ ద్వారా స్వస్థలాలకు తిరిగి వచ్చారు. మ్యాచ్ ముగిశాక లండన్ వీధుల్లో సహచరుడు కుల్దీప్తో కలిసి సరదాగా తిరిగిన అనంతరం అర్ష్ దీప్ స్వదేశానికి బయల్దేరాడు. అతనితో పాటు సిరాజ్, శార్దుల్ కూడా భారత్‌కు చేరుకున్నారు. -
ఉపాధి అవకాశాలపై యుద్ధ మేఘాలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా మధ్య ప్రాచ్యంలో ముసురుకుంటున్న యుద్ధ మేఘాలతో బహుళ జాతి కంపెనీలు నూతన నియామకాలను నిలిపివేయడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. ఏకంగా 63శాతం కంపెనీలు కొత్త నియామకాలను ప్రస్తుతానికి నిలుపుదల చేసినట్టు ప్రముఖ మార్కెటింగ్– హెచ్ఆర్ ప్రొవైడర్ ‘జీనియస్ కన్సల్టెంట్స్’ తాజా నివేదిక వెల్లడించింది. మే, జూన్లలో లింక్డిన్ డేటాను విశ్లేషిస్తూ విడుదల చేసిన నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ..⇒ ప్రపంచంలోని ప్రముఖ బహుళ జాతి సంస్థల్లో 63శాతం కొత్త ఉద్యోగుల నియామకాలను ప్రస్తుతానికి నిలిపివేశాయి. ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టాయి.⇒ 15శాతం సంస్థలు రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించడం, లేదంటే ఫ్రీలాన్సర్ల సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి.⇒ 36శాతం మంది ఉద్యోగుల పదోన్నతులు, జీతాల పెంపు, బోనస్‌ల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం పడింది.⇒ ఉద్యోగులకు పనిభారం 21శాతం పెరిగింది.⇒ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగుల పనితీరు గుర్తింపు, కార్యాలయ పనిమీద విదేశీ పర్యటనల అవకాశాల్లో 22శాతం కోత విధించారు. -
పని ఒత్తిడికి మరొకరు బలి.. అటల్ సేతు పైనుంచి దూకి..
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆందోళనకర ఉదంతం వెలుగు చూసింది. ముంబైలోని అటల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆఫీసులో పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని మృతుని భార్య మీడియాకు తెలిపారు. ఇటీవల పూణెలోని ఒక సీఏ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతి పని ఒత్తిడిన తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఉదంతం మరువక ముందే ముంబైలో ఇదే తరహా విషాదం చోటుచేసుకుంది. మీడియాకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం సుశాంత్ చక్రవర్తి(40) అనే వ్యక్తి తాను ప్రయాణిస్తున్న కారును అటల్ సేతుకు ఒకవైపున నిలిపాడు. ఆ తరువాత బ్రిడ్జిపై నుంచి సముద్రంలోకి దూకాడు. మృతుడు ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసు వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం మృతునికి భార్య, ఏడాది కుమార్తె, తల్లి ఉన్నారు.మృతుని భార్య వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు సుశాంత్ చాలా కాలంగా ఆఫీసులో పని భారంతో ఆందోళన చెందుతున్నాడని తెలిపారు. కాగా సుశాంత్ ఇటీవలే కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుశాంత్ చక్రవర్తి మృతదేహం కోసం పోలీసులు సముద్రంలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు.ఇది కూడా చదవండి: కత్తితో దాడి.. ముగ్గురు మృతి -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్మరణం
సాక్షి, తొగుట (దుబ్బాక) : ‘అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి.. నా చావుకు ఎవరూ కారణం కాదు’అని లేఖ రాసి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసాన్‌పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పన్యాల భాస్కర్‌రెడ్డి, కవిత దంపతుల పెద్ద కుమారుడు నవీన్‌రెడ్డి (23) బీటెక్ పూర్తి చేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించాడు. రెండున్నరేళ్లుగా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. లాక్డౌన్ సమయంలో కంపెనీ వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో ఇంటి వద్ద నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి) ఈ క్రమంలో గ్రామంలో సరిగా సిగ్నల్ రాకపోవడంతో వ్యవసాయ బావి వద్ద గదిలో ఉండి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అక్కడే పనిచేస్తున్నాడు. రోజురోజుకూ పనిభారం పెరగడంతో మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఉద్యోగం మానేస్తానని తల్లిదండ్రులతో చెప్పాడు. దీంతో వారు నీకు ఎలా నచ్చితే అలా చేయమని సర్దిచెప్పారు. రెండు రోజుల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. విషయం తల్లిదండ్రులకు చెబితే బాధ పడతారని చెప్పకుండా దాచాడు. రాజీనామా చేశాక తీవ్ర మానసిక వేదనకు గురైన నవీన్‌రెడ్డి.. శుక్రవారం ఉదయం తండ్రితో పాటు ఉదయం పని ఉందంటూ వ్యవసాయ బావి వద్ద వెళ్లాడు. తండ్రి గేదెల పాలు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఉదయం 8.30 గంటల సమయంలో రెండో కుమారుడు అజయ్ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా పట్టు పురుగుల షెడ్లో ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకుని కనిపించాడు. తొగుట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పంచాయతీ కార్యదర్శుల పనిభారం తగ్గించాలి
సాక్షి, ములుగు: పంచాయతీ కార్యదర్శుల పనిభారం తగ్గించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు పోలు రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి జాతీయ రహదారి మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీని చేపట్టారు. అనంతరం డీఆర్వో కూతాటి రమాదేవికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని ఒత్తిడిని తట్టుకోలేక నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటమండలం గుమ్మడిగూడెంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గురువారం ఆత్మహత్య చేసుకుందన్నారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శులకు పేస్కేల్ , ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న స్రవంతి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్సిగ్రేషియ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు కొండల్‌రెడ్డి, చిరంజీవి, ఇమ్మడి దామోదర్ ఆయా గ్రామల పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
‘అందుకే విశ్రాంతి తీసుకున్నా’
రాజ్‌కోట్: ప్రత్యర్థి బౌలర్లకు దొరకని సమాధానంగా మారాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతమున్న ఏ ఇతర బ్యాట్స్‌మన్ రాణించని చోట ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు. ఈ ఘనతలన్నీ పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లికి చెందుతాయి. ఇంగ్లండ్‌లో అసాధారణ రీతిలో చెలరేగి ఆడిన కోహ్లికి ఆసియా కప్ ముందు విమర్శల సెగ తగిలింది. యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌కు తాను ఆడనని, విశ్రాంతి అవసరమని తెలపడంతో క్రీడా పండితులు విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ విషయంపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి వివరణ ఇవ్వగా, తాజాగా విరాట్ కోహ్లి స్పందించాడు. (కోహ్లిని ఎద్దుతో పోల్చిన రవిశాస్త్రి) ‘ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయాను. అందుకే తప్పనిసరిగా విశ్రాంతి కావాలని సెలక్టర్లను అడిగా. వారు నా పరిస్థితి అర్థం చేసుకొని ఆసియాకప్‌కు విశ్రాంతినిచ్చారు. అంతేకాని ఆసియ కప్ మీద చిన్నచూపు కాదు. విశ్రాంతి అనంతరం కొత్త శక్తి, ఉత్సాహం, పునరుత్తేజం లభిస్తుంది ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే ఆటగాడు అలసిపోతాడని అందరూ అనుకుంటారు. కానీ ఆ భావన తప్పు. ఆడిన మ్యాచ్‌ల్లో పరుగులు సాధించకపోతే ఆ ఆటగాడికి ఎలాంటి వర్క్‌లోడ్ ఉండదు. మ్యాచ్‌లు ఎక్కువ ఆడినంత మాత్రాన వర్క్‌లోడ్ అనిపించదు. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో వర్క్‌లోడ్ ఎక్కువగా ఉంటే తొందరగా అలసిపోతాం. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో వర్క్‌లోడ్ ఎక్కువగా అనిపించింది’.అంటూ విరాట్ కోహ్లి విశ్రాంతి గురించి వివరణ ఇచ్చాడు. ఇక కోహ్లి గైర్హాజర్‌తో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఏడో సారి ఆసియాకప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: కోహ్లి ఒంటిపై ఉన్న టాటూలు ఏంటో తెలుసా? కోహ్లికి రెస్ట్.. రోహిత్‌కు పగ్గాలు -
పనిభారం
• ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది కొరత • సక్రమంగా అందని వైద్య సేవలు • 500 పడకలకు పెంచితే అదనపు సిబ్బంది అవసరం • ప్రతిపాదనలు పంపినా పట్టించుకోని ప్రభుత్వం రెండు, మూడు నెలల్లో ట్రామా కేర్, ఎంసీహెచ్ భవనాలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆస్పత్రి 500 పడకలస్థాయికి పెరుగుతుంది. అదనంగా 200 మంది సిబ్బంది అవసరమవుతారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న 41 పోస్టుల్లో స్పెషలిస్ట్ సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డైటీషియన్, అనలిస్ట్, రేడియాలజిస్ట్, హెడ్నర్స్, స్టాఫ్‌నర్స్, ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వార్డుబాయ్, స్ట్రెచ్చర్ బేరర్లను నియమించాల్సి ఉంది. – ఖమ్మం వైద్య విభాగం ఖమ్మం, వైద్య విభాగం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు 500 పడకల నిర్మాణానికి పూనుకుంది. కానీ సిబ్బంది కొరతతో రోగులకు వైద్య సేవలకు అందటం లేదు. 15 ఏళ్ల క్రితం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని 250 పడకల స్థాయికి తెచ్చారు. అప్పుటి జనాభా ప్రకారం వైద్య సేవలు సక్రమంగానే అందేవి. జిల్లా జనాభా పెరగటంతో సరిహద్దు జిల్లాల నుంచి కూడా రోగుల తాకిడి ఎక్కువైంది. దీంతో ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్ సేవలు పెరిగాయి. ప్రస్తుతం రోజూ 1000 నుంచి 1200 మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. దీంతో ఆస్పత్రిలోని వివిధ విభాగాల సిబ్బందికి పనిభారం పెరిగింది. ఉన్న పడకలకు అదనంగా మరో 100మంది ఇన్‌పేషెంట్లకు వైద్య సేవలు అందించాల్సి వస్తోంది. పడకలు పెరుగుతున్నా సిబ్బంది మాత్రం పెరగటం లేదు. ఈ క్రమంలో అందరికీ పూర్తి స్థాయిలో వైద్యం అందించలేక పోవటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో వేరే గత్యంతరం లేక డాక్టర్లు హైదరాబాద్, ఇతర పట్టణాలకు వెళ్లాలని రిఫర్ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. 202 మంది సిబ్బందితోనే ఆస్పత్రి నిర్వహణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఆస్పత్రికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్, వరంగల్ తర్వాత అత్యధికంగా రోగుల తాకిడి ఇక్కడే ఉంటోంది. అయినా ఈ ఆస్పత్రిని ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. అన్ని రకాల వైద్యానికి ఇక్కడ అవకాశమున్నా తగిన సిబ్బంది మాత్రం లేరు. కేవలం 202 మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు. 143 మంది పర్మినెంట్, 59 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 250 పడకల స్థాయిలో గతంలో 243 మంది సిబ్బంది ఉండేవారు. పలువురు ఉద్యోగ విరమణ పొందటంతో ప్రస్తుతం 41 ఖాళీలు ఏర్పడ్డాయి. అందులో స్పెషలిస్ట్ సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డైటీషియన్, అనలిస్ట్, రేడియాలజిస్ట్, హెడ్నర్స్, స్టాఫ్‌నర్స్, ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. కింది స్థాయి పోస్టులైన వార్డుబాయ్, స్ట్రెచ్చర్ బేరర్స్, జేఎస్‌డబ్ల్యూ అవసరం చాలా ఉంది. పడకలు పెరిగితే సిబ్బందిపై మరింత భారం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మాణంలో ఉన్న భవనాలు అందుబాటులోకి వస్తే సిబ్బందిపై మరింత భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 250 బెడ్లతో పాటు మరో 270 అందుబాటులోకి వస్తాయి. ట్రామా కేర్, ఎంసీహెచ్ బిల్డింగ్ నిర్మాణ దశలో ఉన్నాయి. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తామని టీఎస్ ఎంఎస్ఐడీసీ అధికారులు చెబుతున్నారు. ఆ భవనాలు పూర్తయితే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సామర్థ్యం 520 పడకలకు చేరుతుంది. ఇవి అందుబాటులోకి వస్తే వాటికి సరిపడా సిబ్బందిని కూడా పెంచాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అదనపు సిబ్బంది కోసం అధికారులు పలుమార్లు నివేదిక పంపారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పటికే వైద్య సేవలు అందించటం చాలా కష్టంగా ఉందని, ఆస్పత్రి స్థాయిని రెట్టింపు చేస్తే వైద్య సేవలు అందించటం కష్టమవుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సిబ్బందిని నియమించిన తర్వాతనే నూతన పడకలను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. -
బాసూ.. మాకు మెమొరి లాసూ..!
హా రాత్రి చాలాసేపు చదువుకుని పడుకున్న హృషికేష్ మరుసటి రోజు ఉదయం హడావిడిగా నిద్రలేచాడు. ఉదయం 11 గంటలకు పరీక్ష. 10.45కి బస్సెక్కాడు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలోని పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్నాడు. బాగా చదవడంతో ఎలాంటి ప్రశ్నలొచ్చినా బ్రహ్మాండంగా రాయగలనన్న ధీమాతో ఉన్నాడు. ఆ ఉత్సాహంతోనే పరీక్ష కేంద్రంలోకి ప్రవేశిస్తుండగా గేట్‌మన్ ఆపాడు. హాల్‌టికెట్ చూపించాలన్నాడు. హృషికేష్ అన్ని జేబులు వెతికినా కనిపించలేదు. బిక్కముఖం వేశాడు. అతన్ని పరీక్షకు అనుమతించలేదు. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్ష రాయలేకపోయాడు. మతిమరుపు వల్ల ఒక సంవత్సరం వృథా అయ్యింది. హా వేణుగోపాల్ మెడికల్ రెప్రజెంటేటివ్. అనంతపురం నగరంలోని ఓ ప్రముఖ నర్సింగ్‌హోంకు వెళ్లారు. డాక్టర్ అపాయింట్మెంటు తీసుకుని, తమ కంపెనీకి సంబంధించిన మందుల గురించి వివరించారు. రూ.30 వేలు విలువజేసే మందులకు ఆర్డర్ తీసుకున్నారు. అయితే.. సకాలంలో మందులు సరఫరా చేయలేదు. దీంతో డాక్టర్ వేరే కంపెనీ మందులు కొనుగోలు చేశారు. మతిమరుపు వల్ల మందులు సరఫరా చేయలేకపోయిన వేణుగోపాల్‌కు ప్రమోషన్ ఆగిపోయింది. సాక్షి, అనంతపురం: కాలం మారుతోంది. సాంకేతిక పరిజ్ఞానమూ పెరుగుతోంది. కాలంతో పాటు మనిషి పరుగు తీస్తున్నాడు. పనిఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు పీడిస్తున్నాయి. దీంతో వ్యసనాలకు బానిస అవుతున్నారు. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్, అతిగా సెల్‌ఫోన్ వినియోగం, అతిగా మాంసాహారం తినడం వంటివి అలవాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మతిమరుపునకు గురవుతున్నారు. రోజువారీ వ్యవహారాల్లో చిన్న చిన్న విషయాలను మరచిపోయే జబ్బు చాలా మందికి ఉందట. ప్రత్యేకించి యువత ఈ జబ్బుతో సతమతమవుతోందని వైద్యులు అంటున్నారు. పని ఒత్తిడి, వ్యసనాలే ఇందుకు ప్రధాన కారణాలని వారు చెబుతున్నారు. రెండు రకాలుగా జ్ఞాపకశక్తి మనిషి మెదడులో రెండు రకాలైన మెమొరీ (జ్ఞాపకశక్తి) ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వారి విశ్లేషణ ప్రకారం..స్వల్పకాలిక, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి ఉంటాయి. జీవితంలో జరిగే అరుదైన సంఘటనలు, చదువు, కష్టాలు, నష్టాలు, అనుభవాలు దీర్ఘకాలిక మెమొరీలో ఉంటాయి. రోజువారీ కార్యక్రమాలు స్వల్పకాలిక మెమొరీలో ఉంటాయి. సాధారణంగా స్వల్పకాలిక మెమొరీ ద్వారానే మనిషి దినచర్య సాగుతుంది. దీని ప్రభావం మెదడులోని నరాలపై ఉంటుంది. దీనివల్ల పనిఒత్తిడి పెరిగి రోజువారీ విషయాల్లో మతిమరుపు ఉంటోంది. యువతపై ఎక్కువ ప్రభావం జిల్లా జనాభాలో 20 శాతం వరకు యువత ఉన్నారు. 15 శాతం అంటే దాదాపు ఆరు లక్షల మంది మెమొరీలాస్ సమస్యలతో బాధపడుతున్నారని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. వీరు 15-30 ఏళ్ల మధ్య వయస్కులు. జీవితంలో ఏదో సాధించాలనే ఆలోచనలు వీరి మెదడుపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో మూడు పదుల వయసు దాటకుండానే అనేక మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. లైంగిక సమస్యలు కూడా యువ కుల్లో ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పరిష్కారం లేదా? ఈ సమస్యలకు పరిష్కారం ఉంది. మంచి అలవాట్లు అలవరచుకోవడం, యోగా వంటివి సాధన చేయడం, సెల్‌ఫోన్ వినియోగం తగ్గించడం ద్వారా మతిమరుపును అధిగమించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.