ఉపాధి అవకాశాలపై యుద్ధ మేఘాలు | Genius Consultants report: Multinational companies have stopped 63 percent of recruitment | Sakshi
Sakshi News home page

ఉపాధి అవకాశాలపై యుద్ధ మేఘాలు

Jun 23 2025 3:29 AM | Updated on Jun 23 2025 3:29 AM

Genius Consultants report: Multinational companies have stopped 63 percent of recruitment

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావం

63 శాతం నియామకాలు నిలిపివేసిన బహుళ జాతి కంపెనీలు 

ఉద్యోగులపై 21శాతం అదనపు పనిభారం  

లింక్డిన్‌ డేటా ఆధారంగా జీనియస్‌ కన్సల్టెంట్స్‌ నివేదిక

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థి­తులు ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా మధ్య ప్రాచ్యంలో ముసురుకుంటున్న యుద్ధ మేఘాలతో బహుళ జాతి కంపెనీలు నూతన నియామకాలను నిలిపివేయడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. ఏకంగా 63శాతం కంపెనీలు కొత్త నియా­మ­కాలను ప్రస్తుతానికి నిలుపుదల చేసినట్టు ప్రముఖ మార్కెటింగ్‌– హెచ్‌ఆర్‌ ప్రొవైడర్‌ ‘జీనియస్‌ కన్స­ల్టెంట్స్‌’ తాజా నివేదిక వెల్లడించింది. మే, జూన్‌ల­లో లింక్డిన్‌ డేటాను విశ్లేషిస్తూ విడుదల చేసిన నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ..

ప్రపంచంలోని ప్రముఖ బహుళ జాతి సంస్థల్లో 63శాతం కొత్త ఉద్యోగుల నియామకాలను ప్రస్తుతానికి నిలిపివేశాయి. ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టాయి.
15శాతం సంస్థలు రెగ్యులర్‌ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులను నియమించడం, లేదంటే ఫ్రీలాన్సర్ల సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి.
36శాతం మంది ఉద్యోగుల పదోన్నతులు, జీతాల పెంపు, బోనస్‌ల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం పడింది.
  ఉద్యోగులకు పనిభారం 21శాతం పెరిగింది.
అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగుల పనితీరు గుర్తింపు, కార్యాలయ పనిమీద విదేశీ పర్య­ట­నల అవకాశాల్లో 22శాతం కోత విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement