సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బలవన్మరణం  | Siddipet: Techie Ends Life Due To Workload | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బలవన్మరణం 

Published Sat, Jan 30 2021 2:10 AM | Last Updated on Sat, Jan 30 2021 2:10 AM

Siddipet: Techie Ends Life Due To Workload - Sakshi

నవీన్‌రెడ్డి (ఫైల్‌) 

సాక్షి, తొగుట (దుబ్బాక) : ‘అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి.. నా చావుకు ఎవరూ కారణం కాదు’అని లేఖ రాసి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసాన్‌పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పన్యాల భాస్కర్‌రెడ్డి, కవిత దంపతుల పెద్ద కుమారుడు నవీన్‌రెడ్డి (23) బీటెక్‌ పూర్తి చేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించాడు. రెండున్నరేళ్లుగా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. లాక్‌డౌన్‌ సమయంలో కంపెనీ వర్క్‌ ఫ్రం హోం ఇవ్వడంతో ఇంటి వద్ద నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి)

ఈ క్రమంలో గ్రామంలో సరిగా సిగ్నల్‌ రాకపోవడంతో వ్యవసాయ బావి వద్ద గదిలో ఉండి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అక్కడే పనిచేస్తున్నాడు. రోజురోజుకూ పనిభారం పెరగడంతో మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఉద్యోగం మానేస్తానని తల్లిదండ్రులతో చెప్పాడు. దీంతో వారు నీకు ఎలా నచ్చితే అలా చేయమని సర్దిచెప్పారు. రెండు రోజుల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. విషయం తల్లిదండ్రులకు చెబితే బాధ పడతారని చెప్పకుండా దాచాడు. రాజీనామా చేశాక తీవ్ర మానసిక వేదనకు గురైన నవీన్‌రెడ్డి.. శుక్రవారం ఉదయం తండ్రితో పాటు ఉదయం పని ఉందంటూ వ్యవసాయ బావి వద్ద వెళ్లాడు. తండ్రి గేదెల పాలు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఉదయం 8.30 గంటల సమయంలో రెండో కుమారుడు అజయ్‌ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా పట్టు పురుగుల షెడ్‌లో ప్లాస్టిక్‌ తాడుతో ఉరి వేసుకుని కనిపించాడు. తొగుట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement