ఫెర్గూసన్‌ అద్భుతం.. పీఎన్‌జీపై న్యూజిలాండ్‌ అద్బుత విజయం New Zealand won by seven wickets against Papua New Guinea. Sakshi
Sakshi News home page

T20 WC: ఫెర్గూసన్‌ అద్భుతం.. పీఎన్‌జీపై న్యూజిలాండ్‌ అద్బుత విజయం

Published Tue, Jun 18 2024 7:02 AM | Last Updated on Tue, Jun 18 2024 8:54 AM

New Zealand win by 7 wickets to end campaign on a high

న్యూజిలాండ్‌ టి20 ప్రపంచకప్‌ నుంచి ఇదివరకే నిష్క్రమించింది. అయితే గ్రూప్‌ ‘సి’లో తమ ఆఖరి పోరులో విజయంతో పాటు పేస్‌ బౌలర్‌ ఫెర్గూసన్‌ (4–4–0–3) పుటలకెక్కిన రికార్డు గణాంకాలతో కివీస్‌ శిబిరం సంతృప్తి చెందింది. 

సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 7 వికెట్ల తేడాతో పపువా న్యూగినీపై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినీ జట్టు 19.4 ఓవర్లలో 78 పరుగులకే ఆలౌటైంది. చార్లెస్‌ అమిని (17; 2 ఫోర్లు), నొర్మాన్‌ వనువా (14; 1 ఫోర్, 1 సిక్స్‌), సెసె బవు (12; 1 ఫోర్‌) రెండంకెల స్కోర్లు చేశారు. 

పరుగివ్వకుండా అన్ని మెయిడిన్లే వేసిన ఫెర్గూసన్‌ 3 వికెట్లు తీశాడు. తద్వారా కెనడా బౌలర్‌ సాద్‌ బిన్‌ జఫర్‌ 2021లో పనామాపై వేసిన 4–4–0–2 రికార్డు స్పెల్‌ తుడిచిపెట్టుకుపోయింది. 

అనంతరం సులువైన లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (35; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్‌ విలియమ్సన్‌ (18 నాటౌట్‌; 2 ఫోర్లు), మిచెల్‌ (12 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement