స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, తొలి వన్డే సెంచరీ హీరో డారిల్ మిచెల్ గజ్జ గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో మిచెల్ తొడ కండరాలు పట్టేశాయి.
దీంతో మ్యాచ్ అనంతరం అతడిని స్కాన్స్ కోసం ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్‌లలో చిన్నపాటి చీలిక (minor tear) ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అతడిని జట్టును నుంచి కివీస్ సెలక్టర్లు తప్పించారు. మిచెల్ స్ధానాన్ని వెటరన్ బ్యాటర్ హెన్రీ నికోల్స్‌తో సెలక్టర్లు భర్తీ చేశారు.
"డారిల్ మిచెల్ వంటి అద్బుతమైన ఆటగాడు సిరీస్ మధ్యలో తప్పుకోవడం మాకు గట్టి ఎదురు దెబ్బే. అతడు మా జట్టులో కీలక సభ్యుడు. తర్వాత రెండు మ్యాచ్‌లలో అతడి లేని లోటు మాకు కచ్చితంగా తెలుస్తోంది" అని కోచ్ రాబ్ వాల్టర్ పేర్కొన్నారు. మిచెల్ తిరిగి వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముంది.
న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, మార్క్ చాప్‌మన్
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! స్టార్ ప్లేయర్‌కు మళ్లీ పిలుపు


