పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ నషీమ్ షా ఇంటి వద్ద కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని మయూర్ ప్రాంతంలో ఉన్న నషీమ్ ఇంటిపై సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఇంటి ప్రధాన గేటు, కిటికీలు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా అక్కడ పార్క్ చేసి ఉన్న కారు కూడా డేమజ్ అయ్యింది. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
నసీమ్ షా ఇంటి ప్రధాన ద్వారంపై బుల్లెట్ గుర్తులు వీడియోలో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో మయార్ పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
అదేవిధంగా నసీమ్ షా ఇంటి వద్ద భద్రతను పెంచారు. కాగా ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) వంటి తీవ్రవాద సంస్థల ప్రభావం కూడా ఎక్కువగా పెరిగిందని స్ధానిక మీడియా కథనాలు ప్రచరిస్తోంది.
నషీమ్ షా ప్రస్తుతం జాతీయ విధుల్లో బీజీగా ఉన్నాడు. శ్రీలంకతో తొలి వన్డేకు షా సిద్దమవుతున్నాడు. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
చదవండి: అతడిని అందుకే పక్కనపెట్టాం!.. గంభీర్ తొలి స్పందన ఇదే
Shots Fired at Naseem Shah’s Residence Amid Cross-Border Infiltration Concerns
Unknown gunmen opened fire on national pacer Naseem Shah’s residence in Lower Dir last night, damaging the gate, windows, and a vehicle. Police arrived quickly, detaining five suspects and registering… pic.twitter.com/N67ee14g5Z— HTN World (@htnworld) November 10, 2025


