
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కీలక మార్పు చేసింది. రెండు టైటిళ్లు గెలిపించిన చార్లెట్ ఎడ్వర్డ్స్ (Charlotte Edwards) స్థానంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లిసా కైట్‌లీని (Lisa Keightley) హెడ్ కోచ్‌గా నియమించింది.
చార్లెట్ ఇంగ్లండ్ జాతీయ మహిళల జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నేపథ్యంలో గత కొంతకాలంగా ఎంఐ హెడ్ కోచ్ పదవి ఖాళీగా ఉంది.
54 ఏళ్ల లిసా తన కెరీర్‌లో ఆస్ట్రేలియా తరఫున 92 మ్యాచ్‌లు (9 టెస్ట్‌లు, 82 వన్డేలు, 1 టీ20) ఆడారు. 1997, 2005 ప్రపంచకప్ విజేత జట్టులో భాగమయ్యారు. ఆటకు వీడ్కోలు చెప్పిన తర్వాత కోచింగ్ రంగంలోకి అడుగుపెట్టి, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్ జట్లకు కోచ్‌గా సేవలందించారు.
తాజాగా ఆమె నార్తర్న్ సూపర్‌చార్జర్స్ (Women's Hundred League) విజేతగా నిలిపారు. లిసాకు మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో (WBBL) సిడ్నీ థండర్‌కు కోచ్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది.
ఎంఐ హెడ్ కోచ్‌గా ఎంపికైన అనంతరం లిసా మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ లాంటి అద్బుతమైన ఫ్రాంచైజీలో భాగం కావడం గర్వంగా ఉంది. WPLలో బెంచ్‌మార్క్ సెట్ చేసిన జట్టుతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని అన్నారు.
ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు మూడు WPL సీజన్లలో రెండు టైటిళ్లు (2023, 2025) గెలిచింది. 2024 ఎడిషన్‌లో మాత్రం ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. గెలిచిన రెండు సీజన్లలో ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌లో ఓడించింది. 2026 ఎడిషన్‌లో లిసా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ కోసం పోరాడనుంది.
చదవండి: BCCI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్రకటన.. అతడిపై వేటు