వ‌రుసగా ఐదు ఓట‌ములు.. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న స‌న్‌రైజ‌ర్స్ స్టార్‌ | MLC 2025: Seattle Orcas Fires Coach Mid-season, Heinrich Klaasen Resigns As Captain, Check Out Full Story | Sakshi
Sakshi News home page

MLC 2025: వ‌రుసగా ఐదు ఓట‌ములు.. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న స‌న్‌రైజ‌ర్స్ స్టార్‌

Jun 28 2025 9:01 AM | Updated on Jun 28 2025 11:22 AM

MLC 2025:  Seattle Orcas fires coach mid-season, Heinrich Klaasen resigns as captain

సన్‌రైజర్స్‌ జెర్సీలో హెన్రిస్‌ క్లాసెన్‌(PC: IPL/BCCI)

మేజర్ లీగ్ క్రికెట్(MLC)-2025లో సియాటిల్ ఓర్కాస్ జట్టు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 5 మ్యాచ్‌ల‌లోనూ ఓట‌మి చ‌విచూసిన ఓర్కాస్‌.. పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్ధానంలో కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సియాటిల్ ఓర్కాస్ హెడ్ కోచ్ మాథ్యూ మాట్‌, కెప్టెన్ హెన్రిస్ క్లాసెన్(Heinrich Klaasen) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 

సీజన్ మ‌ధ్య‌లోనే వీరిద్దరూ త‌మ ప‌ద‌విల‌కు రాజీనామా చేశారు. మాథ్యూ మాట్ జ‌ట్టును వీడ‌గా.. క్లాసెన్ ఇక‌పై కేవ‌లం ఆట‌గాడిగా మాత్ర‌మే కొన‌సాగ‌నున్నాడు. క్లాసెన్ స్ధానంలో ఓర్కాస్ కెప్టెన్‌గా జింబాబ్వే స్టార్ సికింద‌ర్ ర‌జా కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఈ విష‌యాన్ని సియాటిల్ ఓర్కాస్ ఫ్రాంచైజీ ధ్రువీక‌రించింది.

"మా ఫ్రాంచైజీతో ఉన్న స‌మ‌యంలో మాథ్యూ మాట్ చూపిన నిబ‌ద్ద‌త‌, ప్రొఫెషనలిజమ్​కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అతడు తన భవిష్యత్ ప్రణాళికలలో సఫలం కావాలని కోరుకుంటున్నాము. ఇక హెన్రిచ్ క్లాసెన్ తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడానికి స్వచ్ఛందంగా కెప్టెన్ పదవి నుంచి వైదొలగాడు.

అతడు తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము. అతడు ఏ నిర్ణయం తీసుకున్నా జట్టు మేలు కోసమే అని నమ్ముతున్నాము. క్లాసెన్ స్ధానంలో సికందర్ రజాను కెప్టెన్‌గా ఎంపిక చేశాము. ఈ ఏడాది సీజన్ సెకెండ్‌హాఫ్‌లో మేము బలంగా పుంజుకుంటామని ఆశస్తున్నాము" అని సియాటిల్ సీఈవో హేమంత్ దువా ఓప్రకటనలో పేర్కొన్నారు. క్లాసెన్ బ్యాటింగ్‌లో కూడా పెద్ద‌గా రాణించలేక‌పోయాడు. 5 ఇన్నింగ్స్‌లలో కేవ‌లం 54 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.  ఈ ఏడాది సీజ‌న్‌లో అత‌డి అత్య‌ధిక స్కోర్ 27గా ఉంది.
చదవండి: IND vs ENG: వైభవ్ సూర్య‌వంశీ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement